అక్షరటుడే, లింగంపేట: Indiramma Housing Scheme | ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల పర్యవేక్షణలో నిర్లక్ష్యం తగదని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు (MLA Madan Mohan Rao) అన్నారు. ఎల్లారెడ్డిలోని తన క్యాంప్ కార్యాలయంలో (Camp Office) గురువారం నియోజకవర్గస్థాయి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
Indiramma Housing Scheme | సీజనల్ వ్యాధులపై అప్రమత్తత అవసరం..
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామాల్లో సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను (Indiramma Houses) త్వరగా చేపట్టాలని, పారిశుధ్య పనులు నిర్వహించాలన్నారు. గ్రామాల్లో సమస్యలుంటే తన దృష్టికి తీసుకురావాలని చెప్పారు. కార్యక్రమంలో ఆర్డీవో పార్థ నర్సింహారెడ్డి, డీఎల్పీవో సురేందర్, ఆయా మండలాల తహశీల్దార్లు, ఎంపీడీవోలు, నీటిపారుదల శాఖ అధికారులు, మిషన్ భగీరథ అధికారులు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.