Homeజిల్లాలునిజామాబాద్​Police Duty Meet | విధి నిర్వహణలో పోటీతత్వం ఉండాలి: సీపీ

Police Duty Meet | విధి నిర్వహణలో పోటీతత్వం ఉండాలి: సీపీ

- Advertisement -

అక్షరటుడే నిజామాబాద్ సిటీ: Police Duty Meet | విధి నిర్వహణలో భాగంగా పోలీసుల్లో పోటీతత్వం ఉండాలని సీపీ సాయి చైతన్య (CP Sai chaitanya) పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలో పోలీస్​ కమాండ్​ కంట్రోల్​ రూంలో (Police Command Control Room) శుక్రవారం పోలీస్​ డ్యూటీ మీట్​ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా పోలీసులకు వివిధ విభాగాల్లో పోటీలు నిర్వహించారు. కానిస్టేబుల్ స్థాయి నుంచి ఏసీపీ స్థాయి వరకు పనిచేసే పద్ధతి మెరుగుపడాలని సీపీ పేర్కొన్నారు.

సైంటిఫిక్, ఫింగర్ ప్రింట్ ఇన్వెస్టిగేషన్​లో భాగంగా శుక్రవారం పోలీసులు పోటీలు నిర్వహించారు. ఇందులో ప్రతిభ కనబర్చిన సిబ్బందిని రాష్ట్రస్థాయిలో జరిగే డ్యూటీ మీట్​కు పంపనున్నారు. కార్యక్రమంలో నిజామాబాద్ అదనపు డీసీపీ బస్వారెడ్డి (Additional DCP Baswa Reddy), సీసీఎస్​ ఏసీపీ నాగవేంద్ర చారి, సీసీఆర్బీ ఏసీబీ రవీందర్​రెడ్డి, సీఐలు, ఎస్సైలు తదితరులు పాల్గొన్నారు.