అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Minister Tummala | రాష్ట్రంలో సరిపడా యూరియా (Urea) నిల్వలు ఉన్నాయని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Tummala Nageswara Rao) అన్నారు. జిల్లా కలెక్టర్లతో సోమవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ సీజన్లో ఇప్పటికే కేంద్రం నుంచి 5.44 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా రాష్ట్రానికి సరఫరా అయిందని మంత్రి తెలిపారు. ఐదు జిల్లాల్లో ఫెర్టిలైజర్ యాప్ (Fertilizer App) ప్రయోగం విజయవంతం అయిందని చెప్పారు. 9 రోజుల్లో 2,01,789 బస్తాల యూరియా యాప్ ద్వారా రైతుల కొనుగోలు చేశారన్నారు. యూరియా సరఫరాలో ఇబ్బందులు రానీయవద్దంటూ ఆదేశించారు. అంతకుముందు మంత్రి సహకార వారోత్సవం సదస్సులో మాట్లాడారు.
Minister Tummala | సహకార సంఘాలు వెన్నెముక
గ్రామీణాభివృద్ధికి సహకార సంఘాలు వెన్నెముక అని మంత్రి తుమ్మల అన్నారు. అంతర్జాతీయ సహకార సంవత్సరం 2025 సందర్భంగా హైదరాబాద్ (Hyderabad)లో సహకార వారోత్సవం–2025ను ఆయన ప్రారంభించారు. సహకార వ్యవస్థను బలోపేతం చేయడంలో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. తెలంగాణ 18.9 మిలియన్ టన్నుల ధాన్యం ఉత్పత్తితో దేశంలో 2వ స్థానంలో ఉందన్నారు. రాష్ట్రంలో ఆయిల్ పామ్, పప్పుధాన్యాలు, ఉద్యానవన పంటల అభివృద్ధికి చర్యలు చేపట్టామన్నారు.
Minister Tummala | సొసైటీల అభివృద్ధి
ప్రాథమిక సహకార సంఘాలను (PACS) అభివృద్ధి చేస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు. కొత్తగా 197 సొసైటీల గుర్తింపునకు అనుమతి ఇచ్చామన్నారు. పీఏసీఎస్‌ల కంప్యూటరీకరణ, డిజిటల్ బ్యాంకింగ్, ఆధార్ ఆధారిత చెల్లింపులు తీసుకు వస్తున్నట్లు తెలిపారు. సొసైటీలను బహుళ-సేవా కేంద్రాలుగా మార్చడంలో, సహకార వారోత్సవాలను నిర్వహించడంలో NABARD కీలక పాత్ర పోషించిందన్నారు.