ePaper
More
    HomeతెలంగాణCollector Nizamabad | జిల్లాలో ఎరువుల కొరత లేదు..: కలెక్టర్​

    Collector Nizamabad | జిల్లాలో ఎరువుల కొరత లేదు..: కలెక్టర్​

    Published on

    అక్షరటుడే, ఆర్మూర్ : Collector Nizamabad | జిల్లా వ్యాప్తంగా ఎక్కడ కూడా ఎరువుల కొరత లేదని కలెక్టర్​ వినయ్ కృష్ణారెడ్డి పేర్కొన్నారు. ఆలూర్​ మండల కేంద్రంలోని కల్లెడి గ్రామంలో కలెక్టర్​ వినయ్​కృష్ణారెడ్డి (Collector Vinay Krishna Reddy) ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. గ్రామంలోని పీహెచ్‌సీని సందర్శించి, ప్రజలకు అందుతున్న వైద్యసేవలను సమీక్షించారు.

    అనంతరం సహకార సంఘం ఎరువుల గోదాంను తనిఖీ చేసి, అక్కడ నిల్వ ఉంచిన ఎరువుల పరిస్థితిని పరిశీలించారు. రైతుల అవసరాలకు సరిపడా ఎరువులు జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో అందుబాటులో ఉన్నాయని కలెక్టర్ స్పష్టం చేశారు. రాబోయే యాసంగి సీజన్‌లో (Yasangi Season) కూడా ఎరువుల కొరత తలెత్తకుండా ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు.

    Collector Nizamabad | పట్టా పాస్​బుక్స్​ లేని వాళ్లకు..

    పట్టా పాస్‌బుక్స్ లేని రైతులు (Farmers) పంటలు సాగు చేస్తే వారికి కూడా ఎరువులు పంపిణీ చేయాలని కలెక్టర్​ అధికారులను ఆదేశించారు. అయితే వారు వాస్తవంగా పంటలు వేశారా లేదా అన్నది నిర్ధారించుకోవాలని సూచించారు. అటు తర్వాత జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను (Zilla Parishad High School) సందర్శించిన కలెక్టర్.. విద్యార్థులకు మధ్యాహ్న భోజనాన్ని తనిఖీ చేశారు. మెనూ ప్రకారం విద్యార్థులకు భోజనం పెట్టాలని ఆదేశాలు జారీ చేశారు.

    అదే విధంగా ఆలూర్ మండల కేంద్రంలో తహశీల్దార్ కార్యాలయాన్ని (Tahsildar Office) సందర్శించిన కలెక్టర్, భూభారతి దరఖాస్తుల పరిష్కారంపై రెవెన్యూ అధికారులతో సమీక్ష నిర్వహించారు. గ్రామాల వారీగా దరఖాస్తులు ఎంతమేరకు పరిష్కరించారు.. పెండింగ్​లో ఎన్ని ఉన్నాయనే సమాచారాన్ని అధికారులతో అడిగి తెలుసుకున్నారు. రోజువారీగా దరఖాస్తుల పరిశీలన చేసి పరిష్కరించాలని తహశీల్దార్ రమేశ్​(Tahsildar Ramesh)కు కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు.

    మండలంలో కొనసాగుతున్న అభివృద్ధి పనులపై ఎంపీడీవో గంగాధర్ (MPDO Gangadhar) నుండి వివరాలు తెలుసుకున్న కలెక్టర్, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల పురోగతిపై ఆరా తీశారు. అదనంగా ఆలూర్‌లో నిర్మాణం జరుగుతున్న 30 పడకల ఆస్పత్రి పనులను కూడా పరిశీలించారు. కార్యక్రమంలో ఎంపీడీవో గంగాధర్, తహశీల్దార్ రమేష్, ఏఆర్ఐ రేణుక, పంచాయతీ కార్యదర్శి చంద్రశేఖర్, డాక్టర్ ప్రకాష్, హెచ్‌ఎం నాగరాజ్, ప్రణయ్ తేజ్ తదితరులు పాల్గొన్నారు.

    Latest articles

    All India Kisan Congress | కామారెడ్డి కాంగ్రెస్​ నాయకుడికి పాట్నా ఓటర్ అధికార్ ర్యాలీ బాధ్యతలు

    అక్షరటుడే, కామారెడ్డి: All India Kisan Congress | కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని దేవునిపల్లి (Devunipally) గ్రామానికి చెందిన...

    Stock Markets | ఐదో రోజూ లాభాలే.. 25 వేలకు పైన నిలదొక్కుకున్న నిఫ్టీ

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Stock Markets | జీఎస్టీ రిఫార్మ్స్‌పై ఆశావహ దృక్పథంతో ఇన్వెస్టర్లు పాజిటివ్‌గా నిలుస్తున్నారు. దీంతో...

    Banswada | ఉపాధ్యాయుడిపై పోక్సో కేసు నమోదు

    అక్షరటుడే, బాన్సువాడ: Banswada | చిన్నారులకు విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఉపాధ్యాయులు (Teacher) కీచకులుగా మారుతున్నారు. అభంశుభం తెలియని విద్యార్థినులపై...

    Karnataka | సైలెంట్‌గా ఉన్న చిరుత‌ని రెచ్చ‌గొటారు.. చివ‌రికి ఏమైంది.. వైర‌ల్ వీడియో

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Karnataka | ఇటీవలకాలంలో సఫారీ టూర్‌లకు వెళ్లే వారి సంఖ్య క్ర‌మ‌క్ర‌మంగా పెరుగుతోంది. అడవుల్లో...

    More like this