HomeతెలంగాణBhatti Vikramarka | మా ప్రభుత్వంలో పవర్‌ షేరింగ్‌ ఏమీలేదు.. భట్టి విక్రమార్క ఆసక్తికర వ్యాఖ్యలు

Bhatti Vikramarka | మా ప్రభుత్వంలో పవర్‌ షేరింగ్‌ ఏమీలేదు.. భట్టి విక్రమార్క ఆసక్తికర వ్యాఖ్యలు

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్: Bhatti Vikramarka | కర్ణాటక కాంగ్రెస్​ సీఎం కుర్చి కోసం అంతర్గత పోరు నడుస్తున్న విషయం తెలిసిందే.

ప్రస్తుత సీఎం సిద్దరామయ్య ఐదేళ్లు పదవిలో కొనసాగాలని అనుకుంటున్నారు. మరోవైపు ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్​ సీఎం పదవి కావాలని ఆకాంక్షిస్తున్నారు. ఈ నేపథ్యంలో అక్కడ రాజకీయం ఆసక్తికరంగా మారింది.

ఈ క్రమంలో తెలంగాణలో సీఎం పీఠంపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఆయన మీడియా చిట్​చాట్​లో మాట్లాడారు. రాష్ట్రంలో కర్ణాటక తరహా పరిస్థితి ఏమీ లేదని తేల్చిచెప్పారు.

కర్ణాటక తరహాలో తమ ప్రభుత్వంలో పవర్‌ షేరింగ్‌ ఏమీ లేదని భట్టి విక్రమార్క అన్నారు. ప్రభుత్వంలో అందరం కలిసికట్టుగా టీమ్‌వర్క్‌ చేస్తున్నామని చెప్పారు. తెలంగాణలో డబుల్‌ ఇంజిన్‌ సర్కార్‌ వచ్చేది లేదని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో మహిళలకు కల్పించిన ఉచిత బస్సు సౌకర్యానికి మంచి స్పందన ఉందని ఆయన పేర్కొన్నారు. ఆర్టీసీలో మరో 3వేల కొత్త బస్సులు కొనేందుకు ప్రయత్నిస్తున్నట్లు భట్టి విక్రమార్క తెలిపారు.