అక్షరటుడే, గాంధారి: Gandhari | గాంధారి మండలంలో మొరం అక్రమ దందా (Moram Dandha) జోరుగా సాగుతోంది. కొందరు అక్రమార్కులు రాత్రికి రాత్రే గుట్టలను తవ్వేస్తున్నారు. లారీలు, ట్రాక్టర్లలో తరలిస్తూ రూ.లక్షలు ఆర్జిస్తున్నారు. ఫలితంగా ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయానికి గండి కొడుతున్నారు. ఇంత జరుగుతున్నా.. సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది.
Gandhari | గాంధారి మండలంలో..
గాంధారి మండలంలోని గుడిమెట్(Gudimet) శివారు ప్రాంతం, సదాశివనగర్ (Sadashivnagar) మండలం శివారు ప్రాంతంలో మొరం దందా యథేచ్ఛగా సాగుతోంది. కొందరు అక్రమార్కులు ఇక్కడి గుట్టలను తవ్వేస్తూ మొరం తరలించుకుపోతున్నారు. రాత్రి పగలు తేడా లేకుండా జేసీబీలతో తవ్వుతూ.. ట్రాక్టర్లు, టిప్పర్లలో తరలిస్తున్నారు.
మాఫియా రూ.లక్షల్లో సంపాదిస్తుండగా ప్రభుత్వానికి మాత్రం రాయల్టీ రూపంలో రావాల్సిన ఆదాయానికి గండి పడుతోంది. అధికారులు అటువైపు దృష్టి పెట్టకపోవడంతో, అక్రమదందా మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతోంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి అక్రమదందాను అడ్డుకోవాలని పలువురు కోరుతున్నారు.
చర్యలు తీసుకుంటాం..
– రేణుక చవాన్, తహశీల్దార్
మొరం అక్రమ తవ్వకాల అంశం మా దృష్టికి రాలేదు. ఈ విషయమై ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటాం. రెవెన్యూ సిబ్బందిని క్షేత్రస్థాయికి పంపి విచారణ చేపడతాం. అక్రమార్కులపై చర్యలు తీసుకుంటాం.