అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Deepika Padukone | బాలీవుడ్ నటి దీపికా పదుకొనే సంచలన వ్యాఖ్యలు చేశారు. సినీ ఇండస్ట్రీలో వివక్ష కొనసాగుతోందని వ్యాఖ్యానించారు. సినిమా పరిశ్రమలో (Film Industry) మగవారిదే ఆధిపత్యం కొనసాగుతోందని పేర్కొన్నారు.
హీరోల విషయంలో ఒకలా, మిగతా వారి విషయంలో మరొలా వ్యవహరిస్తుండడాన్ని ఆమె ప్రశ్నించారు. తనపై జరుగుతున్న విమర్శలను తీవ్రంగా ఖండించిన ఆమె.. తననే ఎందుకు టార్గెట్‌గా చేసుకున్నారో అర్థం కావడం లేదన్నారు. సందీప్ రెడ్డి వంగా సినిమా స్పిరిట్‌తో పాటు నాగ్ అశ్విన్ ‘కల్కి 2898 AD’ సీక్వెల్ నుండి దీపికా పదుకొనే (Deepika Padukone) తప్పుకున్నప్పటి నుంచి ఎనిమిది గంటల షిఫ్ట్ సమయాల గురించి పరిశ్రమలో ప్రత్యేక చర్చ చెలరేగింది. పని గంటలపై భిన్నాభిప్రాయాల కారణంగా దీపిక సినిమాలను విడిచిపెట్టినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో తాజాగా ఓ ఆంగ్ల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో దీపిక కీలక వ్యాఖ్యలు చేశారు.
Deepika Padukone | నన్నే టార్గెట్ చేస్తున్నారు..
ఇండస్ట్రీలో చాలా మంది స్టార్స్ ఉండగా తననే ఎందుకు టార్గెట్ చేస్తున్నారని దీపికా ప్రశ్నించారు. పని గంటల విషయంలో తనను టార్గెట్ చేశారని పేర్కొన్నారు. 8 గంటల షిఫ్ట్ అనేది ఎన్నో ఏళ్ల నుంచి ఇండస్ట్రీలో కొనసాగుతున్నదని చెప్పారు. చాలా మంది స్టార్ హీరోలు 8 గంటలే పని చేస్తారని, వీకెండ్‌లో అసలు షూటింగ్‌కే రారని తెలిపారు. ‘ఆత్మాభిమానం ఉన్న నటిగా నన్ను ఇబ్బందిపెట్టే విషయాలను అంగీకరించలేను. ఇండియన్ సినీ ఇండస్ట్రీలో చాలా మంది స్టార్స్ ఎన్నోఏళ్లుగా 8 గంటలు పని చేస్తున్నారు. ఇదేం కొత్త కాదు, రహస్యం అంతకన్నా కాదు. కానీ, ఇన్నేళ్లలో ఈ విషయం ఎప్పుడూ వార్తల్లోకి రాలేదు. వాళ్ల పేర్లు కూడా నేను చెప్పాలనుకోవడం లేదు. కొంతమంది సోమవారం నుంచి శుక్రవారం వరకు మాత్రమే షూటింగ్స్ చేస్తారు. నాకు ఇదేమి కొత్త కాదు. చాలాసార్లు ఎదుర్కొన్నానని‘ దీపికా పేర్కొన్నారు.
Deepika Padukone | యుద్ధం చేయడమే తెలుసు..
తనపై వస్తున్న విమర్శలను తోసిపుచ్చిన దీపికా.. వాటిపై బహిరంగంగా స్పందించేందుకు నిరాకరించారు. నిశ్శబ్దంగా యుద్ధం చేయడమే తనకు తెలుసన్నారు. ‘నేనెప్పుడూ దేనిపైనా ఓపెన్‌గా స్పందించను. నిశ్శబ్దంగా యుద్ధం చేయడమే నాకు తెలుసు. అలా చేస్తేనే అది గౌరవం అనిపించుకుంటుంది” అని వ్యాఖ్యానించారు. ‘ఇది నాకు కొత్త కాదు. చెల్లింపు వంటి విషయాల విషయానికి వస్తే కూడా నేను నాకు లభించిన దానితో వ్యవహరించాల్సి వచ్చిందని నేను అనుకుంటున్నాను. దానిని ఏమని పిలవాలో నాకు తెలియదు, కానీ నేను ఎల్లప్పుడూ నా పోరాటాలను నిశ్శబ్దంగా పోరాడుతాను, కొన్ని వింత కారణాల వల్ల, కొన్నిసార్లు అవి బహిరంగంగా మారుతాయని’ దీపికా అన్నారు.
Deepika Padukone | పురుషుల గురించి చర్చ లేదే..
సినీ ఇండస్ట్రీలో పురుషులదే డామినేషన్ అని దీపిక స్పష్టం చేశారు. ‘ఒక మహిళగా, అది ఒత్తిడికి గురైతే లేదా ఏదైనా అనిపిస్తే, అలాగే ఉండండి. కానీ చాలా మంది సూపర్ స్టార్లు, మేల్ సూపర్ స్టార్లు భారతీయ చిత్ర పరిశ్రమలో ఎనిమిది గంటల పాటు పనిచేస్తున్నారనేది రహస్యం కాదు. వారు సంవత్సరాలుగా ఇలా చేస్తున్నారు. ఇది మాత్రం ఎప్పుడూ హైలైట్ కాలేదని’ గుర్తు చేశారు. ‘నేను పేర్లు చెప్పదలచుకోలేదు, ఎందుకంటే అది పెద్ద సమస్యగా మారవచ్చు. కానీ చాలా మంది స్టార్ హీరోలు ఎనిమిది గంటలు పని చేస్తారనేది అందరికీ తెలిసిన విషయమే. కొందరు సోమవారం నుండి శుక్రవారం వరకు రోజుకు ఎనిమిది గంటలు పని చేస్తారు మరియు వారాంతాల్లో పని చేయరని’ వ్యాఖ్యానించారు.