అక్షరటుడే, వెబ్‌డెస్క్: Hyderabad Water Supply | హైదరాబాద్ నగరంలో (Hyderabad city) 36 గంటల పాటు తాగునీటి సరఫరాలో అంతరాయం ఉంటుందని జలమండలి అధికారులు తెలిపారు. మరమ్మతు పనుల నేపథ్యంలో పలు ప్రాంతాలకు నీటి సరఫరా (water supply) నిలిపివేస్తామన్నారు.
నగరానికి నీరు సరఫరా చేసే కృష్ణా డ్రింకింగ్ వాటర్ సప్లై పథకం (Drinking Water Supply Scheme) ఫేజ్-2 లో కోదండాపూర్ నుంచి గొడకండ్ల వరకు ఉన్న పంపింగ్ మెయిన్‌పై 200 మిమీ డయా ఎంఎస్‌పై లీకేజీ ఏర్పడింది. దానికి అధికారులు మరమ్మతులు చేయనున్నారు. అలాగే దెబ్బతిన్న 2375 మిమీ డయా ఎంఎస్ ఎయిర్ టీలు, వాల్వ్‌లను మార్పిడి చేయడం, నాసర్లపల్లి వద్ద జంక్షన్ పనులు చేపట్టనున్నట్లు తెలిపారు. వివిధ ప్రాంతాల్లో దెబ్బతిన్న బటర్‌ఫ్లై వాల్వ్‌లు, ఎన్ఆర్వీ (NRV)లను మార్పిడి చేస్తామన్నారు. దీంతో శనివారం (ఈ నెల 10) ఉదయం 6 గంటల నుంచి ఆదివారం సాయంత్రం 6 గంటల వరకు 36 గంటల పాటు పలు ప్రాంతాల్లో తాగునీటి సరఫరాలో అంతరాయం ఉంటుందన్నారు. ప్రజలు సహకరించాలని కోరారు.
Hyderabad Water Supply | అంతరాయం ఏర్పడే ప్రాంతాలు
వనస్థలిపురం, ఆటోనగర్, ఆటోనగర్ రిజర్వాయర్ పరిధిలోని ప్రాంతాలు, వైశాలీనగర్, నాగోల్, బడంగ్పేట్, లెనిన్ నగర్, ఆదిభట్ల, కమ్మగూడ రిజర్వాయర్ పరిధిలోని ప్రాంతాల్లో నీటి సరఫరా నిలిపి వేయనున్నారు. బాలాపూర్ రిజర్వాయర్, బర్కాస్, మైసారం పరిధిలోని ప్రాంతాలు, ఎల్లుగుట్ట రిజర్వాయర్, నాచారం, తార్నాక, బౌద్ధనగర్, నల్లగుట్ట, లాలాపేట, మారేడ్‌పల్లి, ప్రకాష్‌నగర్, పాటిగడ్డ, మేకలమండి మహేంద్ర హిల్స్ రిజర్వాయర్ ప్రాంతాల్లో సైతం తాగునీరు సరఫరా కాదు. ఎంఈఎస్, సికింద్రాబాద్ కాంటోన్మెంట్ బోర్డు, హస్మత్‌పేట్, గౌతమ్‌నగర్, ఫిరోజ్‌గూడ, మధుబన్ రిజర్వాయర్, శాస్త్రిపురం, ప్రశాసన్‌నగర్‌లోని పలు ప్రాంతాల్లో సైతం సరఫరాకు అంతరాయం కలగనుంది.