ePaper
More
    Homeఆంధ్రప్రదేశ్​Tadepalli | కడుపులో బిడ్డ ఉంది.. కొట్టొద్దన్నా వినకుండా పైశాచికం.. అచేతనులపై క్రూరమైన దాడి

    Tadepalli | కడుపులో బిడ్డ ఉంది.. కొట్టొద్దన్నా వినకుండా పైశాచికం.. అచేతనులపై క్రూరమైన దాడి

    Published on

    అక్షరటుడే, అమరావతి: Tadepalli అర్ధరాత్రి.. మద్యం మత్తులో ఉన్న నేర చరిత యువకులు.. మహిళ కనిపించగానే ఉన్మాదులయ్యారు. ఆమెపై పైశాచికంగా దాడికి దిగారు. గర్భంతో ఉన్నానని చెప్పినా వినలేదు. ఆంధ్రప్రదేశ్​(Andhra Pradesh)లోని తాడేపల్లి పోలీస్టేషన్(Tadepalli police station) పరిధి పాత జాతీయ రహదారి(national highway)లో ఉన్న పోలకంపాడు వద్ద ఆదివారం అర్ధరాత్రి ఈ ఘటన జరిగింది.

    బాధితుల కథనం ప్రకారం.. ఆనందరావు రైల్వే ఉద్యోగి(railway employee). ఆమె భార్య ఆర్పీఎఫ్ కానిస్టేబుల్(RPF constable) సునీత. వీరు ఉండవల్లిలో నివాసం ఉంటూ విజయవాడ(Vijayawada)లో విధులు నిర్వహిస్తున్నారు.

    ఎప్పటిలాగే ఆదివారం విధులు ముగిశాక ద్విచక్ర వాహనంపై వస్తున్నారు. పోలకంపాడు(Polakampadu) మూడు బొమ్మల సెంటర్ దాటిన తర్వాత వెనుక నుంచి మద్యం మత్తులో ఉన్న గుర్తుతెలియని ఓ వ్యక్తి ఢీకొన్నాడు. సునీత అయిదు నెలల గర్భిణి. కిందపడిపోయిన ఆమెను ఆనందరావు పైకి లేపుతుండగా, మద్యం మత్తులో ఉన్న ఇద్దరు యువకులు అక్కడికి వచ్చారు. వారిపై దాడి చేశారు. ప్రతిఘటించే క్రమంలో సునీత చెప్పు తీసుకుని కొట్టారు. రెచ్చిపోయిన ఉన్మాద యువకులు ఫోన్ చేసి ఇంకకొందరిని అక్కడికి పిలిపించారు. అంతా గుమిగూడి ఆనందరావు, సునీతను రోడ్డుపైనే విచక్షణారహితంగా కొట్టారు.

    బాధిత భార్యాభర్తలు రక్షించండంటూ కేకలు వేయడంతో.. తాడేపల్లి పోలీసులు వస్తున్న విషయం తెలిసి యువకులు పారిపోయారు. సదరు యువకులపై రౌడీషీట్ ఉన్నట్లు తెలుస్తోంది. దాడి విషయంలో బాధితులు తాడేపల్లి పోలీస్టేషన్​లో ఫిర్యాదు చేశారు.

    More like this

    Hydraa | 600 గ‌జాల స్థ‌లాన్ని కాపాడిన హైడ్రా

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Hydraa | హైదరాబాద్​ (Hyderabad) నగరంలో ప్రభుత్వ, ప్రజా ఆస్తులను హైడ్రా అధికారులు కాపాడున్నారు....

    Revanth meet Nirmala | కళాశాలల్లో అత్యాధునిక ల్యాబ్​ల ఏర్పాటుకు రూ. 9 వేల కోట్లు..!

    అక్షరటుడే, హైదరాబాద్: Revanth meet Nirmala : తెలంగాణ విద్యా రంగంలో స‌మూల‌ మార్పులు తేవ‌డానికి తాము చేస్తున్న‌...

    Nara Lokesh | కేటీఆర్​ను కలిస్తే తప్పేంటి.. ఏపీ మంత్రి లోకేష్​ కీలక వ్యాఖ్యలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Nara Lokesh | మాజీ మంత్రి, బీఆర్​ఎస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్​ కేటీఆర్ (KTR)​ను కలిస్తే...