అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy | రాష్ట్రాన్ని గత పాలకుల పాపాలు శాపాలై వెంటాడుతున్నా పథకాల అమలులో ఎక్కడా రాజీ పడలేదని రాష్ట్ర వ్యవసాయ, రైతుల సంక్షేమ కమిషన్ (Farmers Welfare Commission) ఛైర్మన్ ఎం.కోదండ రెడ్డి(Kodanda reddy) పేర్కొన్నారు.
స్వాతంత్య్ర దినోత్సవాన్ని (Independence Day) పురస్కరించుకుని శుక్రవారం జిల్లా కేంద్రంలోని ఇందిరాగాంధీ స్టేడియంలో (Indira Gandhi Stadium) నిర్వహించిన వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన ఛైర్మన్ కోదండ రెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు.
అనంతరం కోదండ రెడ్డి ప్రసంగిస్తూ.. దేశ స్వాతంత్య్ర కోసం సాగిన మహెద్యమంలో పాలు పంచుకున్న అమరవీరులకు ఘన నివాళులర్పిస్తున్నట్లు తెలిపారు. గాంధీ (Gandhi) సారథ్యంలో సాగిన భారత స్వాతంత్య్ర పోరాటం ప్రపంచానికి ఆదర్శంగా నిలిచిందని స్పష్టం చేశారు.
Kodanda reddy | రేషన్ కార్డు ఆత్మగౌరవ ప్రతీక
70 ఏళ్లుగా పీడీఎస్ వ్యవస్థ పేద ప్రజల ఆహార భద్రతకు భరోసా ఇస్తుందని కోదండ రెడ్డి వివరించారు. అదే స్ఫూర్తితో తమ ప్రభుత్వం ఉగాది నుంచి సన్నబియ్యం పంపిణీ ప్రారంభించి రూ.13 వేల కోట్ల వ్యయంతో 3.10 కోట్ల మందికి బియ్యం పంపిణీ చేయడం జరిగిందన్నారు. రేషన్ కార్డు ప్రజల ఆత్మ గౌరవానికి ప్రతీక అని, ఈ ఏడాది జులై 14 నుంచి రాష్ట్రవ్యాప్తంగా నూతన రేషన్ కార్డులు పంపిణీ ప్రారంభించామన్నారు. జిల్లాలో కొత్తగా 15,302 రేషన్ కార్డులను మంజూరు చేయడం జరిగిందని, కొత్తగా 48,971 మంది కుటుంబ సభ్యులను రేషన్ కార్డులో పేర్లు నమోదు చేయడం జరిగిందన్నారు.
Kodanda reddy | రుణమాఫీతో కొత్త చరిత్ర రాశాం..
గతేడాది ఆగస్టు 15న రైతు రుణమాఫీకి (Runa Mafhi) శ్రీకారం చుట్టడం జరిగిందని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో 25.35 లక్షల మంది రైతులకు 20,616 కోట్ల రుణమాఫీ చేసి దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం రాయని కొత్త చరిత్ర రాశామన్నారు. ఆర్థిక పరిస్థితి సహకరించపోయినా రైతుల విషయంలో రాజీ పడలేదన్నారు.
Kodanda reddy | 9 రోజుల్లో రూ.9 వేల కోట్లు
ఇందిరమ్మ రైతు భరోసా (Indiramma raithu bharosa) కింద ఎకరాకు రూ.12వేల పెట్టుబడి సాయాన్ని ప్రకటించామని, పరిమితులు లేకుండా ప్రతి రైతుకు ఈ పథకం కింద సాయాన్ని అందించామన్నారు. జూన్ 16న ప్రారంభించి కేవలం 9 రోజుల్లో రూ.9వేల కోట్ల రైతుల ఖాతాలో వేశామని తెలిపారు. రాష్ట్రంలోని 70,11,184 మంది రైతులకు ఈ సాయాన్ని అందించినట్టు పేర్కొన్నారు. కొత్తగా దరఖాస్తు చేసుకున్న 1.2 లక్షల రైతులకు కూడా పెట్టుబడి సహాయాన్ని అందించినట్టు వివరించారు. జిల్లాలో ఇందిరమ్మ భరోసా సాయం కింద 3,30,568 మంది ఖాతాల్లో రూ. 305.98 కోట్లు జమ చేశామన్నారు.
Kodanda reddy | అన్నదాతల సంక్షేమానికి 1.13 వేల కోట్లు ఖర్చు
రాష్ట్రంలో 7,178 కొనుగోలు కేంద్రాల ద్వారా రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేశామని కమిషన్ ఛైర్మన్ స్పష్టం చేశారు. కొనుగోలు చేసిన 48 గంటల్లో రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేశామన్నారు. జిల్లాలో గత యాసంగిలో 3,82,555 మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని 446 కొనుగోలు కేంద్రాల నుంచి కొనుగోలు చేశామని, 73,640 మంది రైతులకు రూ.887.53 కోట్లను రైతుల ఖాతాల్లో జమ చేశామన్నారు.
సన్నాలకు క్వింటాలుకు రూ.500 బోనస్ ఇస్తున్నామని తెలిపారు. వ్యవసాయానికి ఉచిత విద్యుత్‌లో భాగంగా 29 లక్షల పంపు సెట్లకు ఉచిత విద్యుత్ అందిస్తున్నామని, దీనికోసం రూ.16,691 కోట్ల సబ్సిడీ విద్యుత్ సంస్థలకు చెల్లిస్తున్నట్టు తెలిపారు. ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్ర వ్యవసాయ చరిత్రను తిరగరాసి అన్నదాతల సంక్షేమానికి రూ.1.13 వేల కోట్ల ఖర్చు చేశామన్నారు. జిల్లాలో వానాకాలం సీజన్ కోసం 71,306 మెట్రిక్ టన్నుల వివిధ రకాల ఎరువులను 2,423 క్వింటాళ్ల జీలుగ విత్తనాలు, 1,495 క్వింటాళ్ల వరిధాన్యం విత్తనాలను పంపిణీ చేయడం జరిగిందన్నారు.
Kodanda reddy | ఇందిరా మహిళా శక్తి ద్వారా ఉపాధి
ఇందిరామహిళా శక్తి పథకం (Indira Mahila Sakthi scheme) ద్వారా మహిళలకు ఉపాధి కల్పిస్తున్నామని కోదండరెడ్డి పేర్కొన్నారు. ఈ పథకం కింద గ్రామీణ ప్రాంతాల్లో 12,905 యూనిట్లను 169.29 కోట్ల పెట్టుబడితో, పట్టణ ప్రాంతాల్లో 154 యూనిట్లను 5.89 కోట్లతో వ్యాపార సంస్థలను ప్రారంభించడం జరిగిందన్నారు. విద్యార్థుల యూనిఫామ్ కుట్టడం ద్వారా మహిళా సంఘాలకు 1.16 కోట్ల ఆదాయం లభించిందన్నారు. బ్యాంకు లింకేజీ ద్వారా గత ఆర్థిక సంవత్సరంలో 818.47 కోట్లు, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో గ్రామీణ ప్రాంతాల్లో రూ.203 కోట్లు, పట్టణ మహిళా సంఘాలకు రూ.30 కోట్ల రుణసాయం అందించడం జరిగిందన్నారు.
Kodanda reddy | సొంతింటి కల సాకారం చేశాం..
రాష్ట్రంలో ఇల్లు లేని నిరుపేదలకు సొంతింటి కల సాకారం చేయడం కోసం ఇందిరమ్మ ఇళ్లను నియోజకవర్గానికి 3,500 చొప్పున మంజూరు చేయడం జరిగిందని కమిషన్ ఛైర్మన్ జరిగిందని పేర్కొన్నారు. ఒకే ఏడాదిలో 4.50 లక్షల ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయబోతున్నామని, దీనికోసం రూ.22,500 కోట్లను వెచ్చిస్తున్నట్టు పేర్కొన్నారు. జిల్లాలో 11,818 మంజూరు కాగా 5,790 ఇళ్ల నిర్మాణం ప్రారంభించడం జరిగిందన్నారు. 2,357 ఇళ్లు బేస్మిట్ లెవల్, 240 ఇళ్ల గోడల వరకు, 82 ఇండ్లు స్లాబ్ లెవల వరకు పూర్తయ్యాయని పేర్కొన్నారు. జుక్కల్ నియోజకవర్గంలోని బంగారుపల్లి గ్రామంలో ఒక ఇంటిని పూర్తి చేయడం జరిగిందన్నారు. జిల్లాలో ఇప్పటివరకు 25.56 లక్షలు లబ్ధిదారులకు చెల్లించడం జరిగిందన్నారు.
Kodanda reddy | యువతను రక్షించుకుంటేనే తెలంగాణ భవిత
యువతను రక్షించుకుంటేనే తెలంగాణకు భవిత ఉంటుందని కోదండ రెడ్డి అన్నారు. యువత ఉద్యోగ, ఉపాధికి పెద్దపీట వేస్తున్నట్లు తెలిపారు. కొత్త ప్రభుత్వం ఏర్పాటైన మరుక్షణమే టీజీపీఎస్సీని (TGPSC) సంస్కరించామని, 20నెలల కాలంలో 60వేల ఉద్యోగాలను భర్తీ చేశామన్నారు. 27 ఎకరాల విస్తీర్ణంలో రూ.2,700 కోట్లతో నయా ఉస్మానియా ఆస్పత్రి భవన సముదాయాన్ని నిర్మిస్తున్నామన్నారు. వైద్య ఆరోగ్య రంగంపై రూ.16,521 కోట్ల ఖర్చు చేస్తున్నట్లు పేర్కొన్నారు. చివరి ఆయకట్టుకు సాగునీరు ఇచ్చే ప్రణాలికతో పెండింగ్ ప్రాజెక్టుల లక్ష్యాలు నిర్దేశించుకుని పూర్తి చేస్తున్నామన్నారు.
గత పాలకుల నిర్లక్ష్యంతో జరిగిన నష్టాన్ని భర్తీ చేస్తూనే శాశ్వత హక్కుల సాధనలో విజయం సాధించేలా వ్యూహాత్మక ప్రణాళికతో ప్రభుత్వం పని చేస్తుందన్నారు. స్థానిక సంస్థల్లో విద్య ఉద్యోగాలలో 42 శాతం బీసీలకు రిజర్వేషన్ కల్పించే బిల్లును మార్చి 17న రాష్ట్ర శాసనసభ ఆమోదించిందన్నారు. సుప్రీంకోర్టు తీర్పుకు అనుగుణంగా రాష్ట్రంలోని ఎస్సీల్లో ఉన్న 59 ఉపకులాలను మూడు గ్రూపులుగా విభజించి గ్రూప్–1 లో 15, గ్రూప్–2 లో 18, గ్రూప్–3 లో 26 కులాలను చేర్చినట్టు పేర్కొన్నారు.
అనంతరం వైద్య ఆరోగ్య శాఖ (Department of Health), అగ్నిమాపక శాఖ (Department of Health), ఇందిరా మహిళ శక్తి, ఆర్టీసీ మహిళా శక్తి పథకానికి సంబంధించిన శకటాలను ప్రదర్శించారు. పలు పాఠశాలల విద్యార్థుల నృత్య ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అనంతరం పలువురు ఉత్తమ అధికారులకు ప్రశంసాపత్రాలను అందజేశారు. కార్యక్రమంలో కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్, ఎస్పీ రాజేష్ చంద్ర, జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి, అదనపు కలెక్టర్లు విక్టర్, చందర్ నాయక్, కామారెడ్డి సబ్ డివిజన్ ఏఎస్పీ చైతన్య రెడ్డి, జిల్లా అటవీశాఖ అధికారిణి నిఖిత, ఇతర అధికారులు పాల్గొన్నారు.