అక్షరటుడే, వెబ్‌డెస్క్: Australia Parliamentary Elections : ఆస్ట్రేలియాలో శనివారం జరిగిన పార్లమెంటు ఎన్నికల పోలింగ్లో ఆసక్తికరమైన ఘటనలు చోటుచేసుకున్నాయి. ఈ దేశంలో ప్రధానిగా ఉన్న ఆంథోని అల్బనీస్ Prime Minister Anthony Albanese, ప్రతిపక్ష నాయకుడు పీటర్ డుటన్ Opposition Leader Peter Dutton మధ్య ప్రధాన పోటీ కొనసాగుతోంది.
కాగా, ఓటు వేసేందుకు అనేక మంది స్విమ్ సూట్లు, అండర్ వేర్లపై పోలింగ్ కేంద్రాలకు తరలిరావడం చర్చనీయాంశంగా మారింది. పురుషులు కేవలం అండర్‌వేర్ underwear పై, మహిళలు స్విమ్ సూట్ ల swimsuits లో వచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నారు. దీనికి సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.

ఓటు వేయడానికి వచ్చేటప్పుడు నిర్దిష్టమైన డ్రెస్ కోడ్ గురించి ఆస్ట్రేలియా రాజ్యాంగంలో ఎక్కడా ప్రస్తావించలేదు. అందుకే ఎవరు ఇష్టం వచ్చినట్లు వారు డ్రెస్లు వేసుకుని వచ్చారు. ‘బడ్జీ స్మగ్లర్’ అనే స్విమ్ వేర్ కంపెనీ ఇచ్చిన ఆఫరే వందల మంది స్విమ్ సూట్ లో రావడానికి కారణంగా చెబుతున్నారు.
స్విమ్ సూట్ లో ఓటేసిన మొదటి 200 మందికి స్విమ్ వేర్ ను ఉచితంగా ఇస్తామని సంస్థ ప్రకటించినట్లు పేర్కొంటున్నారు. అందుకే ఓటర్లు ఇలా స్విమ్ సూట్, అండర్వేర్పై ఓటేసేందుకు పోలింగ్ కేంద్రాలకు వచ్చినట్లు అంటున్నారు.
