HomeతెలంగాణTraffic signals | పనిచేయని ట్రాఫిక్​ సిగ్నళ్లతో అవస్థలెన్నో..

Traffic signals | పనిచేయని ట్రాఫిక్​ సిగ్నళ్లతో అవస్థలెన్నో..

- Advertisement -

అక్షరటుడే, నిజామాబాద్​ సిటీ: Traffic signals | నగరంలో ట్రాఫిక్ సిగ్నల్స్ పనిచేయకపోవడం వల్ల ట్రాఫిక్స్​ సమస్యలు వస్తున్నాయి. ముఖ్యమైన కూడళ్ల వద్ద సిగ్నల్స్ పనిచేయకపోవడంతో వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు.

నగరంలోని ఐదు ప్రాంతాల్లో ఐదు ట్రాఫిక్​ సిగ్నళ్లను ఏర్పాటు చేశారు. అందులో పూలాంగ్​ చౌరస్తా (Poolang Chowrastha) వద్ద ఉన్న సిగ్నల్​ కొన్నిరోజులుగా పనిచేయడం లేదు. దీంతో పోలీసులకు సైతం ట్రాఫిక్ నియంత్రణ కూడా కష్టమవుతోంది. దీంతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది.

Traffic signals | రాకపోకలు ఇబ్బందులు..

నగరంలోని అత్యంత రద్దీ ప్రాంతమైన పూలాంగ్​ వద్ద కొన్నిరోజులుగా ట్రాఫిక్​ సిగ్నళ్లు పనిచేయడం లేదు. దీంతో కూడళ్లలో వాహనాల రాకపోకలు అస్తవ్యస్తంగా మారాయి. ట్రాఫిక్ నియంత్రణ లేకపోవడం వల్ల వాహనదారులు ఇష్టానుసారంగా వెళ్తున్నారు.

దీంతో ప్రమాదాలు జరిగే అవకాశాలున్నాయని ఆందోళన వ్యక్తమవుతోంది. హైదరాబాద్, కామారెడ్డి వైపు వెళ్లే వారు పూలాంగ్​ చౌరస్తా మీదుగా వెళ్తుంటారు. బోధన్ (Bodhan), వర్ని, బాన్సువాడ, బాసర (Basara), భైంసా (Bainsa) వైపు వెళ్లే ఆర్టీసీ బస్సులు ఫులాంగ్ చౌరస్తా మీదుగానే వెళ్తుంటాయి.

Traffic signals | ఉదయం గజిబిజీగా వాహనాల రాకపోకలు..

పూలాంగ్​ వద్ద సాంకేతిక లోపం తలెత్తడంతో సిగ్నల్స్ పనిచేయడం లేదు. ట్రాఫిక్​ డిపార్ట్​మెంట్​ వెంటనే టెక్నీషియన్లను పిలిపించి సిగ్నళ్లను సరిచేయించాల్సి ఉండగా.. వారు పట్టించుకోవడం లేదని వాహనదారులు పేర్కొంటున్నారు. అలాగే ఉషా మయూరి థియేటర్​ చౌరస్తా, వర్ని చౌరస్తాలో (Varni Chowrastha) ట్రాఫిక్ సమస్య తలెత్తుతోంది. ఈ ప్రాంతాల్లో ట్రాఫిక్ సిగ్నల్ లేకపోవడంతో ప్రయాణికులకు ఇబ్బందిగా మారింది. నగరంలో పెరిగిన ట్రాఫిక్, వాహనాల రద్దీకి అనుగుణంగా సిగ్నల్స్​ను పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

సిగ్నల్స్ పరికరాలు హైదరాబాద్​ నుంచి రావాలి

– మస్తాన్ అలీ, ట్రాఫిక్ ఏసీపీ

పులాంగ్ చౌరస్తాలో ఉన్న ట్రాఫిక్ సిగ్నల్స్​లో చిప్ ప్యానల్ బోర్డు పాడైపోయింది. సంబంధిత కాంట్రాక్టర్​కు ఈ విషయం తెలియజేశాం. వారం రోజుల నుంచి ఈ సిగ్నల్స్ పనిచేయడం లేదు. సిగ్నల్స్​కు సంబంధించిన కాంట్రాక్టర్, టెక్నీషియన్ అందుబాటులో ఉండడం లేదు. వీలైనంత తొందరగా సిగ్నల్స్​ను రిపేరు చేయిస్తాం.