ePaper
More
    HomeతెలంగాణBandi Sanjay | అప్పుడు బీఆర్​ఎస్​ టచ్​లోకి వచ్చింది.. బండి సంజయ్​ సంచలన వ్యాఖ్యలు

    Bandi Sanjay | అప్పుడు బీఆర్​ఎస్​ టచ్​లోకి వచ్చింది.. బండి సంజయ్​ సంచలన వ్యాఖ్యలు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ :Bandi Sanjay | బీఆర్​ఎస్​ పార్టీ(BRS Party)ని బీజేపీలో విలీనం చేసేందుకు యత్నిస్తున్నారని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(MLC Kavitha) ఇటీవల చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారి తీసిన విషయం తెలిసిందే.

    తాజాగా ఆమె వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి బండి సంజయ్ (Union Minister Bandi Sanjay)​ స్పందించారు. కల్వకుంట్ల ఆర్ట్స్ అండ్ క్రియేషన్స్ ఆధ్వర్యంలో ఈ డ్రామా అంతా జరుగుతోందని ఆయన ఎద్దేవా చేశారు. కేటీఆర్, హరీష్ రావు, కవిత, సంతోష్ రావు మధ్య నాలుగు ముక్కలాట నడుస్తోందన్నారు. కవిత వ్యవహారంతో తెలంగాణ ప్రజలకు ఏదైనా లాభం ఉందా అని ఆయన ప్రశ్నించారు.

    Bandi Sanjay | అరెస్ట్​ చేయకుండా ఉండేందుకు..

    కవితను అరెస్ట్ చేయకుండా ఉండేందుకు బీజేపీలో బీఆర్ఎస్​ కలపడానికి యత్నించారని బండి సంజయ్​ సంచలన వ్యాఖ్యలు చేశారు. “లిక్కర్​ స్కామ్(Liquor scam)​లో కవిత​ అరెస్టయిన విషయం తెలిసిందే. ఆమెను అరెస్ట్​ చేయకుండా ఉంటే పార్టీని విలీనం చేస్తామని బీఆర్​ఎస్​ నేతలు తమకు టచ్​లోకి వచ్చారు. అయితే కుటుంబ, అవినీతి పార్టీ అయిన బీఆర్​ఎస్​(BRS)ను తాము దగ్గరకు కూడా రానివ్వలేదు” అని ఆయన తెలిపారు. బీజేపీ బలపడుతున్న ప్రతిసారీ కేసీఆర్​ కొత్త డ్రామాలకు తెరలేపుతారన్నారు. ఆ క్రమంలో తాజాగా కవిత ఎపిసోడ్​ నడుస్తోందని విమర్శించారు.

    Bandi Sanjay | రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తాం

    ప్రధాని మోదీ (Prime Minister Modi) ఇచ్చిన మాట ప్రకారం దేశంలో రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని కేంద్ర మంత్రి బండి సంజయ్​ అన్నారు. తాము అధికారంలోకి వచ్చాక అన్నదాతల ఆదాయాన్ని 80శాతం పెంచామన్నారు. 2014లో వరికి మద్దతు ధర క్వింటాల్​కు రూ.1,310 ఉండేదన్నారు. ఇటీవల కేంద్రం రూ.69 పెంచడంతో రూ.2,389కి పెరిగిందన్నారు. త్వరలో వందశాతం పెంచుతామని ఆయన హామీ ఇచ్చారు. అన్ని పంటలకు కనీస మద్దతు ధరను పెంచినట్లు వివరించారు. మార్కెట్లో యూరియా ధరలు పెరిగినప్పటికీ.. రైతులకు సబ్సిడీ ఇస్తూ ఆ భారాన్ని కేంద్రమే భరిస్తుందన్నారు.

    More like this

    Formula E Race Case | ఫార్మూలా ఈ రేసులో భారీగా అవినీతి.. ఏసీబీ సంచలన నివేదిక

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Formula E Race Case | రాష్ట్రంలో స్థానిక ఎన్నికల (Local Body Elections)...

    Nizamabad City | జెండాగల్లిలో పేకాట..

    అక్షర టుడే, వెబ్ డెస్క్: Nizamabad City | నగరంలోని జెండాగల్లిలో పేకాట స్థావరంపై నాలుగో టౌన్ పోలీసులు...

    Renjal Mandal | విద్యార్థులకు ఖురాన్ అందజేత

    అక్షరటుడే, బోధన్: Renjal Mandal | పట్టణంలోని రెంజల్ బేస్​లో గల నిజామియా పాఠశాలలో విద్యార్థులకు ఖురాన్ పుస్తకాలు,...