అక్షరటుడే, వెబ్డెస్క్: Balakrishna | ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు (Andhra Pradesh Politics) రోజు రోజుకు వివాదాలకు కేంద్రంగా మారుతున్నాయి. మంగళవారం పులివెందులు, ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికల (ZPTC by-elections) సందర్భంగా తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న విషయం తెలిసిందే. పలువురు నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. కొన్ని గ్రామాల్లో వైసీపీ, టీడీపీ నాయకులు (YCP And TDP Leaders) దాడులు చేసుకున్నారు. ఇటీవల వైసీపీ నాయకులు రప్పా రప్పా (Rappa Rappa Dailouge) అనే ఫ్లెక్సీలతో హంగామా చేశారు. మాజీ మంత్రి పేర్ని నాని (Perni Nani) ఏకంగా చీకట్లో పనులు అయిపోవాలని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తాజాగా హిందూపురం ఎమ్మెల్యే, సినీ హీరో బాలకృష్ణ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
Balakrishna | ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ
గుంటూరు జిల్లా (Guntur District) తుళ్లూరులో బుధవారం ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి బాలకృష్ణ (Nandamuri balakrishna) హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వంపై దుష్ప్రచారం చేసే వారి తలలు తీయాలని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కూటమి ప్రభుత్వ హయాంలో అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నట్లు బాలకృష్ణ తెలిపారు. పింఛన్లను రూ.నాలుగు వేలకు పెంచామన్నారు. అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా సీఎం చంద్రబాబు నాయడు (CM Chandrababu Naidu) పనిచేస్తున్నారన్నారు. ప్రభుత్వంపై దుష్ప్రచారం చేసే వారి తలలు తీయాలన్నారు.
Balakrishna | కొంత మంది రాష్ట్రాన్ని నాశనం చేశారు
గతంలో చంద్రబాబు హయాంలో రాష్ట్రాన్ని అభివృద్ధి చేసినట్లు బాలకృష్ణ తెలిపారు. తలసరి ఆదాయం పెంచామన్నారు. అయితే తర్వాత వచ్చిన కొంతమంది రాష్ట్రాన్ని నాశనం చేశారని పరోక్షంగా జగన్ను (YS Jagan) ఉద్దేశించి వ్యాఖ్యానించారు. వాళ్ల పేర్లు కూడా చెప్పడం తనకు ఇష్టం లేదన్నారు. అయితే సమయం వచ్చినప్పుడు తాట తీస్తామని హెచ్చరించారు.
Balakrishna | ఏపీ, తెలంగాణ నా అడ్డా
ప్రజలకు వద్దకు పాలన తీసుకొచ్చిన గొప్ప వ్యక్తి ఎన్టీఆర్ (NTR) అని బాలయ్య అన్నారు. అంతకు ముందు ఆయన అమరావతిలో బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి నిర్మాణానికి భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రా, తెలంగాణ (Andhra Pradesh – Telangana) తన అడ్డా అన్నారు. రెండు రాష్ట్రాల్లో ఎక్కడ నిలబడినా తాను గెలుస్తానని చెప్పారు.