అక్షరటుడే, నిజామాబాద్ రూరల్: Mopal | మోపాల్ పోలీస్స్టేషన్ (Mopal Police Station) పరిధిలోని సిర్పూర్ (Sirpur) తండాలో సేవాలాల్ ఆలయంలో చోరీ జరిగింది. మోపాల్ ఎస్సై సుశ్మిత (Mopal SI Sushmita) తెలిపిన వివరాల ప్రకారం.. తండాలోని సేవాలాల్ ఆలయంలో శుక్రవారం అర్ధరాత్రి తలుపులు పగులగొట్టిన గుర్తు తెలియని వ్యక్తులు అమ్మవారి విగ్రహంపై ఉన్న సుమారు తులం బంగారు ఆభరణాలు చోరీ చేశారు.
అలాగే నర్సింగ్పల్లిలోని (NarsingPally) పెద్దమ్మ గుడిలో సైతం తులం బంగారు పుస్తెలు ఎత్తుకెళ్లారు. అదేరోజు గుడితండాలోని సేవాలాల్ గుడిలో దేవుడిపై ఉన్న సుమారు తులం బంగారు ముక్కు పుడక, పుస్తెలు చోరీ చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
