అక్షరటుడే, బాన్సువాడ: theft in Birkur | దొంగలు రెచ్చిపోతున్నారు. తాళం వేసిన ఇళ్లే లక్ష్యంగా ఎగబడుతున్నారు. ఇంట్లోకి చొరబడి ఉన్నదంతా దోచుకుని ఇల్లును గుల్ల చేస్తున్నారు.
తాజాగా కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండల కేంద్రంలో భారీ దొంగతనం జరిగింది. గ్రామానికి చెందిన గాండ్ల సంజీవ్ ఇంట్లో దొంగలు చొరబడి పెద్ద ఎత్తున నగదు, బంగారం, వెండి ఆభరణాలు దోచుకెళ్లారు.
theft in Birkur | పెద్ద మొత్తంలో నగలు, నగదు..
బాధితుడు సంజీవ్ తెలిపిన వివరాల ప్రకారం.. ఇంట్లో ఉన్న ఐదు తులాల బంగారు ఆభరణాలు, 13 తులాల వెండి, రూ. 3 లక్షల నగదు, పట్టా పాస్‌బుక్ ఎత్తుకెళ్లారు.
ఇంటిల్లిపాది రెండు రోజుల క్రితం చింతకుంట గ్రామానికి వెళ్లారు. సోమవారం సాయంత్రం తిరిగి ఇంటికి వచ్చారు. కాగా, ఇంటి తాళం పగలగొట్టి ఉండటాన్ని చూసి, లోపలికి వెళ్లారు. ఇంట్లోని బీరువాలో దాచిన డబ్బు, నగలు దొంగతానికి గురైనట్లు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు.
డీఎస్పీ విఠల్ రెడ్డి, సీఐ తిరుపతయ్య, ఎస్సై మహేందర్ ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. క్లూస్ టీమ్ ఆధారాలను సేకరించింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
