140
అక్షరటుడే, బోధన్ : Bodhan | బోధన్ పట్టణం (Bodhan Town)లో దొంగలు రెచ్చిపోయారు. రెండు బంగారం దుకాణాల్లో (Gold Shops) చోరీ చేశారు. శనివారం అర్ధరాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది.
పట్టణంలోని ప్రభుత్వ ఆస్పత్రి ఎదురుగా ఉన్న శివ గోల్డ్ సిల్వర్ మర్చంట్ దుకాణాల్లో చోరీ జరిగింది. షట్టర్ తాళాలు పగలగొట్టి దొంగలు లోనికి చొరబడ్డారు. ముగ్గురు వ్యక్తులు చోరీ చేసినట్లు సీసీ కెమెరాల్లో రికార్డు అయింది. బోధన్ పట్టణ సీఐ వెంకటనారాయణ (CI Venkata Narayana) ఘటన స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.