అక్షరటుడే, వెబ్డెస్క్: Nizamabad City | నిజామాబాద్ నగరంలోని శంభుని గుడిలో (Shambhuni Temple) చోరీ జరిగింది. పట్టపగలు ఓ వ్యక్తి ఆలయంలోకి చొరబడి పూజ సామగ్రి ఎత్తుకెళ్లాడు. ఈ ఘటన బుధవారం మధ్యాహ్నం చోటు చేసుకుంది.
నగరంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శంభుని గుడిలోకి ఓ వ్యక్తి గోడదూకి ప్రవేశించాడు. అనంతరం వెండి హారతి పల్లాలు, శఠగోపురం, ఇత్తడి పూజ సామగ్రి, పంచలోహ హారతి పళ్లెం, రాగి ప్లేట్లు తీసుకని పరారు అయ్యాడు. సాయంత్రం పూజారి వచ్చి చూసే సరికి పూజ సామగ్రి కనిపించలేదు. ఈ విషయాన్ని ఆలయ ఛైర్మన్ బింగి మధుకు తెలిపారు. ఆయన ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. రెండో టౌన్ ఠాణా ఎస్సై ముజాహిద్ ఘటన స్థలాన్ని పరిశీలించారు.
Nizamabad City | సీసీ కెమెరాలో రికార్డు
ఎస్సై ఆలయానికి చేరుకొని సీసీ టీవీ ఫుటేజీ (CCTV footage) పరిశీలించారు. ఓ వ్యక్తి పూజ సామగ్రిని ఎత్తుకెళ్తున్న దృశ్యాలు అందులో రికార్డు అయ్యాయి. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు. కాగా సదరు వస్తువులను మిర్చి కాంపౌండ్ ప్రాంతంలో పాత సామాన్లు కొనుగోలు చేసే వ్యక్తి కొన్నట్లు సమాచారం. దొంగకు రూ.200 ఇచ్చి పూజా సామగ్రి తీసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.