అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Mahindra XUV 7XO | మహీంద్రా కంపెనీ మరో మోడల్ కారును తీసుకువచ్చింది. భారత్‌లో తన పాపులర్ ఎస్‌యూవీ (SUV) అయిన ఎక్స్‌యూవీ700 ను కొత్త రూపంలో ఎక్స్‌యూవీ 7ఎక్స్‌వో పేరుతో విడుదల చేసింది. ఎక్స్‌యూవీ 7ఎక్స్‌వోకి హ్యుందాయ్ అల్కాజార్, ఎంజీ హెక్టార్, టాటా సఫారీలకు ప్రధాన పోటీదారుగా నిలుస్తుందని భావిస్తున్నారు. దీని స్పెసిఫికేషన్స్ ఇలా ఉన్నాయి.
ఎక్స్‌టీరియర్ డిజైన్..
ఇది ఎక్స్‌యూవీ 700 డిజైన్‌ను గుర్తుకు చేస్తుంది. అయితే డిజైన్‌లో కీలకమైన మార్పులు స్పష్టంగా కనిపిస్తాయి. ముందు భాగంలో పూర్తిగా కొత్త గ్రిల్ డిజైన్, నిలువు ఆకారంలోని స్టైలిష్ ఎలిమెంట్స్‌తో పాటు మధ్యలో మహీంద్రా ‘ట్విన్ పీక్స్’ (Mahindra ‘Twin Peaks‘) లోగో ఉంటుంది. ముందు భాగంలో స్టైలిష్‌గా ఉండే సీ షేప్ ఎల్‌ఈడీ లైట్లు, వెనకవైపు ఒకదానికొకటి కలిసిపోయేలా ఎల్‌ఈడీ టైల్ లైట్లు ఉన్నాయి. పెద్ద 19 అంగుళాల కొత్త అల్లాయ్ వీల్స్ ఉన్నాయి.
ముందు బంపర్ మరింత అగ్రెసివ్‌గా ఉండగా, ఎయిర్ డ్యామ్ కూడా కొత్తగా డిజైన్ చేశారు. కొత్త కలర్ ఆప్షన్లు కూడా ఉండనున్నాయి.
ఇంటీరియర్, టెక్నాలజీ..
ప్రీమియం అనుభూతిని ఇవ్వనుంది. కారు డాష్‌బోర్డ్ మీద మూడు స్క్రీన్లున్నాయి. డ్రైవర్ కోసం ఒకటి, మధ్యలో ఇన్ఫోటైన్‌మెంట్ కోసం మరొకటి, ముందుభాగంలో డ్రైవర్ పక్కన కూర్చునేవారికోసం మూడో స్క్రీన్ ఉన్నారు. వాయిస్ కమాండ్స్ కోసం ఏఐ చాట్‌బాట్‌ను ఇన్‌బిల్ట్‌గా ఇచ్చారు. ఎంటర్‌టైన్‌మెంట్ కోసం 16 స్పీకర్లు ఉన్న హర్మాన్ కార్డాన్ ఆడియో సిస్టమ్ ఉంది. ఈజీ పార్కింగ్ కోసం, కారు చుట్టూ ఉన్నవన్నీ చూడటానికి 540 డిగ్రీల కెమెరా సిస్టమ్ అమర్చారు. ఫ్రంట్ ప్యాసింజర్ సీటుకు ఎలక్ట్రానిక్ ‘బాస్ మోడ్’ అందించనున్నారు. దీనివల్ల వెనక సీట్లో కంఫర్ట్ మరింత పెరుగుతుంది. కొత్త రెండు స్పోక్ స్టీరింగ్ వీల్, పియానో బ్లాక్ ఫినిష్, టాన్ బ్లాక్ కలర్ థీమ్ డాష్‌బోర్డ్‌కు ప్రీమియం టచ్ ఇస్తాయి. పనోరామిక్ సన్‌రూఫ్, డ్యుయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్, వైర్‌లెస్ ఆపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, సరౌండ్ వ్యూ కెమెరాలు ఉండనున్నాయి.
ఇంజిన్ : ఎక్స్‌యూవీ 700లో ఉన్న ఇంజిన్ ఆప్షన్లనే కొనసాగించారు. పెట్రోల్ వర్షన్‌లో 2.0 లీటర్ టర్బో ఇంజిన్ 197 బీహెచ్‌పీ శక్తిని, 380 ఎన్‌ఎం టార్క్‌ను అందిస్తే.. డీజిల్ వర్షన్‌లో 2.2 లీటర్ ఎంహాక్ ఇంజిన్ 182 బీహెచ్‌పీ శక్తిని, 450 ఎన్‌ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తాయి. 6 స్పీడ్ మాన్యువల్, 6 స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌లు కొనసాగనున్నాయి.
భద్రత : ఇందులో లెవల్ 2 ADAS టెక్నాలజీ, 7 ఎయిర్‌బ్యాగ్‌లు ఉన్నాయి. ఈ కారుకు 5 స్టార్ భారత్ ఎన్‌క్యాప్ రేటింగ్ లభించింది. అంటే ఈ ఎస్‌యూవీ చాలా సురక్షతమైనదన్న మాట.
ధర : పెట్రోల్ వర్షన్ ఆన్‌రోడ్ ధర సుమారు రూ. 15 లక్షల నుంచి ప్రారంభమవనున్నట్లు తెలుస్తోంది. డీజిల్ వర్షన్ టాప్ మోడల్ ధర రూ. 30.18 లక్షల వరకు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.