- Advertisement -
Homeక్రీడలుWomen World Cup | ఉమెన్ వరల్డ్ కప్ షెడ్యూల్ రిలీజ్.. భారత్ - పాక్...

Women World Cup | ఉమెన్ వరల్డ్ కప్ షెడ్యూల్ రిలీజ్.. భారత్ – పాక్ మ్యాచ్ ఎప్పుడో తెలుసా?

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్: Women World Cup | పుష్క‌ర కాలం త‌ర్వాత‌ భారత్‌ మహిళల వన్డే ప్రపంచ కప్‌కు Womens cricket world cup మ‌న‌దేశం ఆతిథ్యం ఇస్తుంది. ఈ టోర్నమెంట్ సెప్టెంబర్ 30 నుంచి ప్రారంభమవుతుంది. భారత్‌ చివరిసారిగా ఈ ఈవెంట్‌కు 2013లో ఆతిథ్యం ఇచ్చింది. ఇక‌, ఇండియా ఆతిథ్యం ఇస్తున్న ఈ ఐసీసీ టోర్నీ(ICC tournament)లో దాయాదుల పోరు ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ అని చెప్ప‌డంలో ఎలాంటి సందేహం లేదు. ఈ ఏడాది చివరలో జరిగే ఐసీసీ ఉమెన్స్ వరల్డ్ కప్ సిరీస్​కు సంబంధించి షెడ్యూల్ రిలీజైంది. కాగా.. భారత్, శ్రీలంక వేదికగా జరుగుతున్న ఈ సిరీస్​కు సంబంధించిన మ్యాచ్ డేట్స్, వేదికలను ఐసీసీ ఖరారు చేసింది. ఈ మేరకు ఇవాళ పూర్తి షెడ్యూల్ ప్రకటించింది. కాగా.. వరల్డ్ కప్ సిరీస్ ఫస్ట్ మ్యాచ్ సెప్టెంబర్ 30న బెంగళూరు చిన్నస్వామి స్డేడియం(Chinnaswamy Stadium) వేదికగా భారత్, శ్రీలంక మధ్య జరగనుంది.

Women World Cup | దాయాదుల మ‌ధ్య ఫైట్..

ఇక క్రికెట్ అభిమానులు ఎంతో ఆస‌క్తిగా భార‌త్ – పాక్ మ్యాచ్ కోసం ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తుంటారు. ఈ క్రమంలో తాజాగా ఐసీసీ ఈ హై-వోల్టేజ్ మ్యాచ్ జ‌రిగే వేదిక‌, తేదీని ప్ర‌క‌టించింది. అక్టోబర్ 5న కొలంబోలోని ఆర్.ప్రేమదాస స్టేడియంలో దాయాదుల పోరు జరగనుంది. కాగా.. బీసీసీఐ, పీసీబీ మధ్య హైబ్రిడ్ హోస్టింగ్ ఒప్పందంలో భాగంగా పాక్‌ తన అన్ని మ్యాచ్‌లను కొలంబోలో ఆడుతుంది. భార‌త్ త‌న తొలి మ్యాచ్‌ను సెప్టెంబర్ 30న బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో శ్రీలంక(Sri lanka)తో ఆడ‌నుంది. ఆ త‌ర్వాత అక్టోబర్ 5న కొలంబో వేదిక‌గా పాక్‌తో (Pakistan) ఆడుతుంది. అనంత‌రం అక్టోబ‌ర్‌ 9న విశాఖపట్నంలో దక్షిణాఫ్రికాతో భారత్ తలపడుతుంది. ఆ త‌ర్వాత వ‌రుస‌గా అక్టోబర్ 12న ఇదే వేదికలో ఆస్ట్రేలియాతో, అక్టోబర్ 19న ఇండోర్‌లో ఇంగ్లాండ్‌తో, అక్టోబర్ 23న గౌహతిలో న్యూజిలాండ్‌తో, అక్టోబర్ 26న బంగ్లాదేశ్‌తో బెంగళూరు(Bengaluru)లోని చిన్నస్వామి స్టేడియంలో జరిగే మ్యాచ్‌తో లీగ్ స్టేజీని ముగించనుంది.

- Advertisement -

కాగా.. వరల్డ్ కప్ సిరీస్(World Cup series)లో అక్టోబర్ 26 వరకు గ్రూప్ దశ మ్యాచ్​లు జరగనున్నాయి. అనంతరం పాయింట్ల పట్టికలో టాప్​లో నిలిచిన నాలుగు జట్లను సెమీఫైనల్స్​కు ఎంపిక చేస్తారు. కాగా సెమీఫైనల్ మ్యాచ్​లు అక్టోబర్ 29, 30 తేదీల్లో జరగనున్నాయి. మొదటి స్థానంలో నిలిచిన జట్టు నాలుగో స్థానంలో నిలిచిన జట్టుతో, రెండో స్థానంలో నిలిచిన జట్టు మూడో స్థానంలోని జట్టుతో సెమీ ఫైనల్స్ ఆడనున్నాయి. ఇక ఉత్కంఠభరితమైన ఫైనల్ మ్యాచ్ నవంబర్ 2న జరగనుంది. బెంగళూరు, ఇండోర్, గువహతి, విశాఖపట్నం, కొలంబో ఈ ఐదు వేదికలలో మొత్తం 28 లీగ్ మ్యాచ్‌లు, మూడు నాకౌట్ మ్యాచ్‌లు జరుగుతాయి. ఈసారి కూడా 2022లో లానే రౌండ్-రాబిన్ విధానంలోనే టోర్నీ జ‌రుగుతుంది. లీగ్ ద‌శ‌లో ఎనిమిది జట్లు ఒకదానితో ఒకటి ఒకసారి ఆడతాయి. అందులో టాప్‌-4 జట్లు సెమీ-ఫైనల్స్‌కు అర్హత సాధిస్తాయి. మొదటి సెమీ-ఫైనల్: అక్టోబర్ 29 (గువహతి లేదా కొలంబో), రెండో సెమీ-ఫైనల్: అక్టోబర్ 30 (బెంగళూరు), ఫైనల్: నవంబర్ 2 (బెంగళూరు లేదా కొలంబో) జరుగుతాయి. కాగా.. ఈసారి టోర్నీకి భారత్‌ (ఆతిథ్య దేశం), ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, శ్రీలంక, పాకిస్థాన్, బంగ్లాదేశ్ జట్లు అర్హత సాధించాయి.

- Advertisement -
- Advertisement -
Must Read
Related News