అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Vikarabad | వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడని భర్తను హత్య చేసిందో మహిళ. ఈ ఘటన వికారాబాద్ జిల్లాలో (Vikarabad district) చోటు చేసుకుంది.
చోడాపూర్ మండల కేంద్రానికి చెందిన కర్రె రత్నయ్యకు భార్య కవిత, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. రత్నయ్య పొలం పనులు చేస్తూ జీవిస్తుండగా.. కవిత ఓ ప్రైవేట్ కంపెనీలో (private company) కూలీ పనులు చేస్తోంది. ఆమెకు అదే గ్రామానికి చెందిన దాసరి రామకృష్ణతో వివాహేతర సంబంధం ఉంది. ఈ విషయం భర్త రత్నయ్యకు తెలిసి భార్యను పలుమార్లు మందలించాడు. పెళ్లిడుకొచ్చిన కూతుర్లు ఉన్నారని, ఇలాంటి పనులు మానేయాలని సూచించాడు.
Vikarabad | అడ్డు తొలగించుకోవాలని..
భర్త (Husband) హెచ్చరించడంతో కవిత అతడి అడ్డు తొలగించుకోవాలని ప్లాన్ వేసింది. ప్రియుడు రామకృష్ణతో కలిసి పథకం వేసింది. ఈ క్రమంలో రత్నయ్య రోజు మాదిరిగా.. పొలం పనులకు వెళ్లగా వెనుక నుంచి రామకృష్ణ ట్రాక్టర్‌తో ఢీకొట్టాడు. అనంతరం తన భర్త రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడని కవిత పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే తన సోదరుడి మృతి అనుమానాలు ఉన్నాయని రత్నయ్య తమ్ముడు దేవయ్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో భార్యపై అనుమానంతో విచారించగా అసలు విషయం బయట పడింది. ప్రియుడు రామకృష్ణతో కలిసి తానే భర్తను చంపినట్లు కవిత ఒప్పుకుంది. దీంతో ఇద్దరిని అరెస్ట్ చేసి పోలీసులు రిమాండ్‌కు తరలించారు.