అక్షరటుడే, కామారెడ్డి: Ration Cards | పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ (Government Advisor Shabbir Ali) అన్నారు. కామారెడ్డి పట్టణంలోని ఇందిరానగర్ కాలనీ, హరిజన వాడలో శనివారం ఆయన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తుందన్నారు.
గత ప్రభుత్వం పదేళ్లలో ఒక్కరేషన్ కార్డు కూడా ఇవ్వలేదని షబ్బీర్ అలీ అన్నారు. తాము అధికారంలోకి వచ్చిన 18 నెలల్లోనే అర్హులైన పేదలకు రేషన్ కార్డులు పంపిణీ చేస్తున్నామని తెలిపారు. లబ్ధిదారులకు సన్నబియాన్ని అందజేస్తున్నామన్నారు.
పేదల కళ్లలో ఆనందం చూడడం కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. గత ప్రభుత్వం ఏనాడైనా పేదల సంక్షేమాన్ని పట్టించుకుందా అని ప్రశ్నించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు బీసీ డిక్లరేషన్‌కు తాము కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. బిల్లు ఆమోదం కోసం గవర్నర్ వద్దకు పంపించామని, బీసీ రిజర్వేషన్ ప్రకారం రాబోయే ఎన్నికలు జరుగుతాయని తెలిపారు.