Homeజిల్లాలుకామారెడ్డిNizamsagar Project | నిజాంసాగర్​ ప్రాజెక్ట్​లో రంగు మారిన నీళ్లు.. ఎందుకంటే..!

Nizamsagar Project | నిజాంసాగర్​ ప్రాజెక్ట్​లో రంగు మారిన నీళ్లు.. ఎందుకంటే..!

- Advertisement -

అక్షరటుడే, నిజాంసాగర్​: Nizamsagar Project | నిజాంసాగర్​ ప్రాజెక్ట్​లోని నీళ్లు రంగుమారాయి. ప్రాజెక్ట్​లోని నీళ్లు ఇలా రంగు మారడంతో పర్యాటకులు (Tourists) ఒకింత ఆశ్యర్యపోయారు.

ప్రాజెక్ట్​ ఎగువ ప్రాంతం నుంచి ఇన్​ఫ్లో లేకపోవడంతో నిలువ ఉన్న నీళ్లు ఆకుపచ్చ వర్ణంలో కనిపించాయి. వర్షాకాలం ప్రారంభమై రెండు నెలలు గడుస్తున్నా.. వర్షాల జాడ లేకపోవడంతో ప్రాజెక్ట్​ నీటిమట్టం నిలకడగా ఉంది. ప్రస్తుతం ప్రాజెక్టులో 1405.00 అడుగులు 17.80 నీటి నిలువకు గాను 1391.06 అడుగులు 4.50 నీరు నిల్వ ఉంది. వెయ్యి క్యూసెక్కుల నీటిని ప్రధాన కాలువ ద్వారా ఆయకట్టుకు విడుదల చేస్తున్నారు.

వర్షాల జాడ కరువు

నిజాంసాగర్​ ఎగువ ప్రాంతంలో వర్షాలు కురవకపోవడంతో ఇన్​ఫ్లో రావడం లేదు. దీంతో ఆయకట్టు రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ సీజన్​ ఇప్పటి వరకు రెండు మూడు రోజుల పాటు మాత్రమే వందల క్యూసెక్కుల నీరు వచ్చి చేరింది. వర్షాలు భారీగా కురిసి ప్రాజెక్టు నిండుకుండలా మారాలని అన్నదాతలు వరుణుడిని ప్రార్థిస్తున్నారు.