అక్షరటుడే, డిచ్పల్లి: Telangana University | తెలంగాణ యూనివ్సిటీ వైస్ ఛాన్స్లర్, రిజిస్ట్రార్ తక్షణమే రాజీనామా చేయాలని ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ జిల్లా ప్రధాన కార్యదర్శి గొల్లపల్లి రాజుగౌడ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం ప్రకటన విడుదల చేశారు. తెలంగాణ విశ్వవిద్యాలయంలో (Telangana University) జరిగిన అక్రమ నియామకాలను రద్దు చేస్తూ రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన తీర్పుపై యూనివర్సిటీ ఉన్నతాధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం విచారకరమన్నారు.
హైకోర్టు (High Court) నుంచి వచ్చిన తీర్పును నిర్లక్ష్యం చేయడం చూస్తుంటే.. వీసీ, రిజిస్ట్రార్ అండదండలతోనే ఈ వ్యవహారం నడుస్తోందని స్పష్టమవుతోందన్నారు. తెయూలో అక్రమ నియామకాల రద్దుపై స్టే ఇవ్వడం అంటేనే యూనివర్సిటీ అధికారులకు (university officials) చెంపపెట్టు లాంటిదన్నారు.
దీనికి నైతిక బాధ్యత వహిస్తూ తక్షణం వీసీ, రిజిస్ట్రార్ తమ పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అక్రమ నియామకాలపై చర్యలు తీసుకోకపోతే.. హైకోర్టులో ఇంప్లిడ్ పిటిషన్ వేస్తామని ఆయన హెచ్చరించారు. ఇప్పటికైనా వీసీ, రిజిస్ట్రార్ అక్రమార్కులకు కొమ్ముకాయకుండా యూనివర్సిటీ ప్రయోజనాల గురించి ఆలోచించాలని ఆయన డిమాండ్ చేశారు.