భారతదేశంలో చేనేత వస్త్రం అంటే కేవలం ఒక గుడ్డ ముక్క కాదు; అది మన పూర్వీకుల కథలు, అద్భుతమైన నైపుణ్యం మరియు తరతరాల భావోద్వేగాల కలయిక. మహారాష్ట్ర పైథానీ నుండి గుజరాత్ బాంధనీ వరకు, లక్నో చికంకారీ నుండి తెలంగాణ పోచంపల్లి ఇక్కత్ వరకు ప్రతి ప్రాంతానికి ఒక విశిష్టమైన నేత శైలి ఉంది. అయితే, ఈ సున్నితమైన వస్త్రాలను మెయింటైన్ చేయడం కష్టమనే భయంతో చాలామంది వీటిని ధరించడానికి వెనుకాడుతుంటారు.
ఈ వారసత్వాన్ని కాపాడుకోవడానికి మరియు మీ వస్త్రాల మన్నికను పెంచడానికి గోద్రెజ్ ఎంటర్ప్రైజెస్ గ్రూప్‌కు చెందిన అప్లయన్సెస్ బిజినెస్ వాషింగ్ మెషీన్స్ హెడ్ మనీష్ శర్మ కొన్ని విలువైన సూచనలు అందించారు. ఆ వివరాలు మీ కోసం..
నేత రకాన్ని గుర్తించి వర్గీకరించండి
ప్రతి చేనేత వస్త్రానికి వాడే దారం, రంగులు మరియు అల్లిక వేర్వేరుగా ఉంటాయి. అందుకే అన్నింటినీ కలిపి ఉతకకూడదు.
కేర్ లేబుల్ చూడండి: మెషీన్ వాష్‌కు ఏవి పనికొస్తాయో లేబుల్ ద్వారా తెలుసుకోండి. ముఖ్యంగా రంగులు వెలిసిపోయే అవకాశం ఉన్న లేదా భారీ జరీ పని ఉన్న వస్త్రాలను విడిగా ఉంచండి.
మెషీన్ డ్రమ్ నిండా బట్టలు వేయకండి
చేనేత వస్త్రాలు మెషీన్లో ఫ్రీగా కదలడానికి తగినంత స్థలం ఉండాలి.
ఘర్షణ తగ్గించండి: బట్టలు ఒకదానికొకటి రాసుకోకుండా ఉండాలంటే డ్రమ్‌ను పూర్తిగా నింపకూడదు. దీనివల్ల వస్త్రంపై ఒత్తిడి తగ్గి, నేత దెబ్బతినకుండా ఉంటుంది.
నీటి ఉష్ణోగ్రత, డిటర్జెంట్ ఎంపిక
వేడి నీరు సహజ దారాలను బలహీనపరుస్తుంది. అలాగే ఘాటైన కెమికల్స్ రంగులను పాడుచేస్తాయి.
సాధారణ నీరు: ఎప్పుడూ 20 నుండి 25 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత ఉన్న సాధారణ నీటిని వాడండి.
సున్నితమైన వాష్: గాఢత తక్కువగా ఉండే మైల్డ్ డిటర్జెంట్లను మాత్రమే ఉపయోగించండి.
జెంటిల్-వాష్ టెక్నాలజీని వాడండి
ఆధునిక వాషింగ్ మెషీన్లలో చేనేత వస్త్రాల కోసం ప్రత్యేకమైన ఫీచర్లు ఉంటున్నాయి.
తక్కువ వేగం: మెషీన్లో ఉతికేటప్పుడు ‘జెంటిల్ వాష్’ మోడ్‌ను ఎంచుకోండి. దీనివల్ల వస్త్రం లోపలి దారాలు చెదిరిపోవు.
టెస్టెడ్ మెషీన్లు: గోద్రెజ్ వంటి సంస్థలు చేనేత వస్త్రాల కోసం ప్రత్యేకంగా పరీక్షించిన టెక్నాలజీని అందుబాటులోకి తెచ్చాయి, ఇవి బట్టలను ఎంతో జాగ్రత్తగా శుభ్రం చేస్తాయి.
ఆరబెట్టే విధానం ముఖ్యం
బట్టలను ఉతికిన తర్వాత వాటిని గట్టిగా పిండటం లేదా మెలితిప్పడం చేయకూడదు.
తక్కువ స్పిన్: ఫ్రంట్-లోడ్ మెషీన్లలో తక్కువ RPM వేగంతో నీటిని తొలగించండి.
నీడలో ఆరబెట్టండి: సూర్యరశ్మి నేరుగా తగిలితే రంగులు వెలిసిపోయి, బట్ట పీచులా మారుతుంది. అందుకే గాలి ఆడే నీడ ప్రదేశంలో మాత్రమే ఆరబెట్టాలి.