ePaper
More
    Homeక్రీడలుCSK vs SRH | మ్యాచ్ టర్నింగ్ పాయింట్.. కామిందు కళ్లు చెదిరే క్యాచ్!

    CSK vs SRH | మ్యాచ్ టర్నింగ్ పాయింట్.. కామిందు కళ్లు చెదిరే క్యాచ్!

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: CSK vs SRH  | ఐపీఎల్ 2025 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్(Sunrisers Hyderabad) మరో విజయాన్ని సొంతం చేసుకుంది. చెన్నై సూపర్ కింగ్స్‌(Chennai Super Kings)తో శుక్రవారం చెపాక్ మైదానం వేదికగా జరిగిన డూ ఆర్ డై మ్యాచ్‌లో సమష్టిగా రాణించిన ఆరెంజ్ ఆర్మీ 5 వికెట్ల(Wickets) తేడాతో గెలుపొందింది. 12 ఏళ్ల తర్వాత చెన్నై గడ్డపై సన్‌రైజర్స్ విజయం సాధించింది.

    ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన సీఎస్‌కే(CSK) 19.4 ఓవర్లలో 154 పరుగులకు ఆలౌటైంది. డెవాల్డ్ బ్రెవిస్(Dewald Brevis)(25 బంతుల్లో ఫోర్, 4 సిక్స్‌లతో 42), ఆయుష్ మాత్రే(19 బంతుల్లో 6 ఫోర్లతో 30) రాణించారు. సన్‌రైజర్స్ హైదరాబాద్(SRH)బౌలర్లలో హర్షల్ పటేల్(4/28) నాలుగు వికెట్లతో చెలరేగగా.. ప్యాట్ కమిన్స్, జయదేవ్ ఉనాద్కత్ రెండేసి వికెట్లు పడగొట్టారు. మహమ్మద్ షమీ, కామిందు మెండీస్ చెరో వికెట్ తీసారు.

    అనంతరం సన్‌రైజర్స్ హైదరాబాద్ 18.4 ఓవర్లలో 5 వికెట్లకు 155 పరుగులు చేసి సునాయస విజయాన్నందుకుంది. ఇషాన్ కిషన్(Ishan Kishan)(34 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్‌తో 44), కామిందు మెండీస్(Kamindhu Mendis)(22 బంతుల్లో 3 ఫోర్లతో 32 నాటౌట్), నితీష్ కుమార్ రెడ్డి(13 బంతుల్లో 2 ఫోర్లతో 19 నాటౌట్) రాణించారు. చెన్నై బౌలర్లలో నూర్ అహ్మద్(2/42) రెండు వికెట్లు పడగొట్టగా.. ఖలీల్ అహ్మద్, అన్షుల్ కంబోజ్, రవీంద్ర జడేజా తలో వికెట్ తీసారు.

    CSK vs SRH  | మ్యాచ్ టర్నింగ్ పాయింట్..

    ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ స్పిన్ ఆల్‌రౌండర్, సవ్యసాచి కామిందు మెండీస్(Kamindhu Mendis) కళ్లు చెదిరే క్యాచ్‌తో మ్యాచ్‌ను సన్‌రైజర్స్ హైదరాబాద్‌వైపు మలుపు తిప్పాడు. సీఎస్‌కే డేంజరస్ బ్యాటర్ డెవాల్డ్ బ్రెవిస్(డెవాల్డ్ బ్రెవిస్) లాంగాఫ్‌లో ఇచ్చిన కష్టతరమైన క్యాచ్‌ను బౌండరీ లైన్ వద్ద కామిందు మెండీస్ స్టన్నింగ్ డైవ్‌తో అందుకున్నాడు. ఈ సూపర్ మ్యాన్ క్యాచ్‌(Super Man Catch) అందర్నీ సంభ్రమాశ్చర్యానికి గురి చేసింది. హర్షల్ పటేల్(Harshal Patel) వేసిన 13వ ఓవర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ సీజన్‌కే ఈ క్యాచ్ హైలైట్‌గా నిలిచింది. ఈ క్యాచ్ అందుకోకపోయి ఉంటే బ్రెవిస్ విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగి మరిన్ని పరుగులు చేసేవాడు. అప్పుడు మ్యాచ్ ఫలితం మరోలా ఉండేది.

    Latest articles

    Kaleshwaram Commission | రేపు కేబినెట్ ముందుకు కాళేశ్వరం నివేదిక.. ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకుంటుందో?

    అక్షరటుడే, వెబ్​డెస్క్​ : Kaleshwaram Commission | కాళేశ్వరం కమిషన్ నివేదిక సోమవారం మంత్రిమండలికి చేరనుంది. ఈ మేరకు...

    Viral video | వైర‌ల్ వీడియో.. ఎలుగుబంటితో మందుబాబు కుస్తీ.. చివ‌రికి ఏమైందంటే..!

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Viral video | సోష‌ల్ మీడియాలో కొన్నివీడియోలు ఒళ్లు గ‌గుర్పొడిచేలా చేస్తాయి. ఒక్కోసారి ఆ వీడియోలు...

    Railway Passengers | నత్తనడకన మనోహరాబాద్​–కొత్తపల్లి రైల్వేలైన్​ పనులు.. భారీగా పెరిగిన అంచనా వ్యయం

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Railway Passengers | మనోహరాబాద్​–కొత్తపల్లి రైల్వే లైన్​ (Manoharabad–Kothapalli Railway Line) పనులు నత్తనడకన...

    Superstar Rajinikanth | కూలీ ట్రైల‌ర్ లాంచ్ ఈవెంట్‌లో ర‌జ‌నీకాంత్ పాదాల‌పై ప‌డ్డ స్టార్ హీరో.. అంతా షాక్

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Superstar Rajinikanth | సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ ఈ వ‌య‌స్సులోనూ ఉత్సాహంగా సినిమాలు చేస్తూ...

    More like this