అక్షరటుడే, భీమ్‌గల్: Mla Prashanth reddy | కాంగ్రెస్ ప్రభుత్వం గత ఎన్నికల్లో వచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే ప్రశాంత్‌రెడ్డి డిమాండ్ చేశారు. వేల్పూర్‌లోని (Velpur) తన కార్యాలయంలో బుధవారం కల్యాణలక్ష్మి (Kalyana Lakshmi), షాదీముబారక్ (Shadi Mubarak) దరఖాస్తులపై సంతకాలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడారు.
కొత్తగా వివాహాలు జరిగిన వారికి కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకంలో భాగంగా అదనంగా ఇస్తామన్న తులం బంగారం పథకాన్ని వెంటనే అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. భీమ్‌గల్‌లో 136, మెండోరా 46, మోర్తాడ్ 27 ఇలా మొత్తం 244 దరఖాస్తులు వచ్చాయన్నారు.
కొత్తగా చెక్కులు మంజూరయ్యే లబ్ధిదారులకు రూ. లక్షతో పాటు తులం బంగారం ఇవ్వాలన్నారు. కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ దరఖాస్తులపై ఎప్పటికప్పుడు సంతకాలు చేసి ప్రభుత్వానికి పంపుతున్నామని పేర్కొన్నారు.