అక్షరటుడే, వెబ్‌డెస్క్: Srisailam | ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు (private travels bus) అదుపు తప్పి రోడ్డు పక్కన ఉండే రెయిలింగ్‌ను ఢీకొంది. ఈ ఘటన విజయవాడ నుంచి శ్రీశైలం (Vijayawada to Srisailam) మార్గంలో దోర్నాల ఘట్ వద్ద చోటు చేసుకుంది.
ప్రకాశం జిల్లా దోర్నాల – శ్రీశైలం ఘాట్‌లో సోమవారం ఉదయం పెద్ద ప్రమాదం తప్పింది. మూలమలుపు వద్ద భవానీ మాలధారులతో శ్రీశైలం వెళ్తున్న ట్రావెల్స్ బస్సు అదుపు తప్పి రెయిలింగ్‌ను ఢీకొంది. దీంతో భవానీ స్వాములు ఆందోళనకు గురయ్యారు. బ్రేక్ ఫెయిల్ కావడంతో ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. అయితే బస్సు కొంచెం ముందుకు వెళ్తే లోయలో పడిపోయేది. కరెక్ట్‌గా రెయిలింగ్, సైడ్ వాల్‌ను ఢీకొని ఆగిపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
Srisailam | 40 మంది భక్తులు
ప్రమాద సమయంలో బస్సులో 40 మంది భవానీ స్వాములు ఉన్నారు. వీరంతా వైజాగ్ నుంచి శ్రీశైలం (Vizag to Srisailam) ప్రమాదం జరిగింది. ఎదురుగా వస్తున్న బస్సును తప్పించే యత్నంలో.. బ్రేక్ ఫెయిలై కావడంతో యాక్సిడెంట్ జరిగిందని డ్రైవర్ తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ట్రాఫిక్ అంతరాయం లేకుండా చూశారు.
Srisailam | ముగిసిన దీక్ష విరమణలు
విజయవాడ ఇంద్రకీలాద్రిపై (Indrakeeladri) భవానీ దీక్షా విరమణలు ముగిశాయి. ఐదు రోజుల పాటు దుర్గమ్మను 5 లక్షల మంది భవానీలు దర్శించుకున్నారు. భవానీ దీక్షా విరమణ దృష్ట్యా ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ పెరిగింది. దీంతో ఆర్జిత సేవలతో పాటు వీఐపీ ప్రోటోకాల్ దర్శనాలు రద్దు చేసి అధికారులు స్వాముల కోసం ఏర్పాట్లు చేశారు.