ePaper
More
    HomeతెలంగాణNizamabad City | నిజామాబాద్ నగరపాలక సంస్థ​ కమిషనర్​ బదిలీకి బ్రేక్​..!

    Nizamabad City | నిజామాబాద్ నగరపాలక సంస్థ​ కమిషనర్​ బదిలీకి బ్రేక్​..!

    Published on

    అక్షరటుడే, ఇందూరు: Nizamabad City | నిజామాబాద్​ మున్సిపల్ కార్పొరేషన్​ కమిషనర్​ను బదిలీ చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు బుధవారం రాత్రి ఉత్తర్వులు వెలువడిన విషయం తెలిసిందే. కాగా.. ఆయన బదిలీకి సంబంధించి బ్రేక్ పడినట్లు తెలుస్తోంది.​ మున్సిపల్​ కమిషనర్​గా పనిచేస్తున్న దిలీప్​కుమార్​ను (Dilip Kumar) ఏడాది కాకుండానే బదిలీ చేయడం నగరంలో చర్చనీయాంశంగా మారింది.

    నిజామాబాద్​ మున్సిపాలిటీలో 60 డివిజన్లు ఉన్నాయి. నాలుగు లక్షలకు పైగా జనాభా ఉన్న మేజర్​ మున్సిపల్​ కార్పొరేషన్​లో సమస్యలూ భారీగానే ఉన్నాయి. కాగా.. కార్పొరేషన్​పై పట్టుసాధించేలోపే మున్సిపల్​ కమిషనర్​ను బదిలీ చేయడం ఉద్యోగుల్లో చర్చకు దారితీసింది.

    Nizamabad City | ప్రజాప్రతినిధులు రంగంలోకి..

    నిజామాబాద్​ మున్సిపల్​ కమిషనర్​ దిలీప్​కుమార్​ను బదిలీ చేస్తున్నట్లు ఉత్తర్వులు వెలువడ్డాయి. దీనిపై రాజకీయ వర్గాల్లో తీవ్రచర్చ జరిగినట్లు సమాచారం. జిల్లా నుంచి రాష్ట్రస్థాయిలో ప్రాతినిథ్యం వహిస్తున్న పీసీసీ చీఫ్​ బొమ్మ మహేశ్​కుమార్​ గౌడ్ (PCC Chief Bomma)​, మాజీ మంత్రి, ఎమ్మెల్యే సుదర్శన్​రెడ్డి (Mla Sudarshan Reddy), ప్రభుత్వ సలహాదారులైన షబ్బీర్​అలీ (Shabbir Ali) మున్సిపల్​ కమిషనర్​ బదిలీ అంశంపై సీరియస్​ అయినట్లు సమాచారం. కనీస సమాచారం లేకుండా జిల్లాలో ముఖ్యమైన అధికారిని ఎలా బదిలీ చేస్తారని వారు సీఎంవోను ప్రశ్నించినట్లు తెలిసింది.

    Nizamabad City | మేజర్​ మున్సిపల్​ కార్పొరేషన్​..

    నిజామాబాద్​ మున్సిపల్​ కార్పొరేషన్​ (Nizamabad Municipal Corporation) పరిధిలో​ పారిశుధ్యం, మంచినీటి సరఫరా ముఖ్యమైన అంశాల్లో ఇప్పుడిప్పుడే గాడిన పడుతోంది. ఇలాంటి సమయంలో ముఖ్య అధికారిని బదిలీ చేస్తే.. పరిస్థితి మళ్లీ మొదటికి వస్తుందని ప్రజాప్రతినిధుల వాదన. నగర మున్సిపల్​ కార్పొరేషన్​ కమిషనర్​గా దిలీప్​కుమార్​ ఏడాది క్రితమే బాధ్యతలు చేపట్టారు. అంతలోనే ఆయన బదిలీ రాజకీయవర్గాల్లో.. అధికారుల్లో చర్చనీయాంశమైంది.

    Nizamabad City | వెనక్కి వెళ్లిపోయిన కొత్త కమిషనర్​..?

    కమిషనర్​ బదిలీపై ప్రజాప్రతినిధులు సీఎంవోపై ఒకింత ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఆయన బదిలీ నిలిచిపోయినట్లు సమాచారం. కొత్త కమిషనర్​గా బాధ్యతలు స్వీకరించేందుకు నిజామాబాద్​కు గురువారం బయలుదేరిన యాదగిరిరావుకు ఉన్నతాధికారులు ఫోన్​లో సమాచారం ఇవ్వడంతో ఆయన మార్గమధ్యం నుంచే తిరిగి వెళ్లిపోయినట్లు సమాచారం.

    Latest articles

    Earth Store | హైదరాబాద్‌లో సందడి చేసిన శ్రియా.. ‘అర్థ్’ స్టోర్​ను ప్రారంభించిన నటి..

    అక్షరటుడే, హైదరాబాద్ : Earth Store | సినీ నటి శ్రియా(Actress Shriya) హైదరాబాద్​లో సందడి చేసింది. కొండాపూర్‌లోని...

    CP Sai Chaitanya | పెయిడ్​ పార్కింగ్​ ఏరియా రాజీవ్​గాంధీ ఆడిటోరియం: సీపీ

    అక్షరటుడే నిజామాబాద్ సిటీ: CP Sai Chaitanya | ఖలీల్​వాడిలో (Khalilwadi) ట్రాఫిక్​ రద్దీని క్రమబద్ధీకరిస్తున్నామని సీపీ సాయిచైతన్య...

    SP Rajesh Chandra | మహిళకు ఉరి కేసులో ఒకరి అరెస్ట్

    అక్షరటుడే, కామారెడ్డి : SP Rajesh Chandra | మహిళను చీర కొంగుతో ఉరివేసి హత్య చేసిన నిందితుడిని...

    BHEL Notifications | బీహెచ్‌ఈఎల్‌లో ఇంజినీర్‌, సూపర్‌ వైజర్‌ పోస్టులు.. ఈనెల 28తో ముగియనున్న దరఖాస్తు గడువు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : BHEL Notifications | భారత్‌ హెవీ ఎలక్ట్రికల్స్‌ లిమిటెడ్‌(BHEL) మెకానికల్‌, ఎలక్ట్రానిక్స్‌, ఇన్‌స్ట్రుమెంటేషన్‌ విభాగాలలో...

    More like this

    Earth Store | హైదరాబాద్‌లో సందడి చేసిన శ్రియా.. ‘అర్థ్’ స్టోర్​ను ప్రారంభించిన నటి..

    అక్షరటుడే, హైదరాబాద్ : Earth Store | సినీ నటి శ్రియా(Actress Shriya) హైదరాబాద్​లో సందడి చేసింది. కొండాపూర్‌లోని...

    CP Sai Chaitanya | పెయిడ్​ పార్కింగ్​ ఏరియా రాజీవ్​గాంధీ ఆడిటోరియం: సీపీ

    అక్షరటుడే నిజామాబాద్ సిటీ: CP Sai Chaitanya | ఖలీల్​వాడిలో (Khalilwadi) ట్రాఫిక్​ రద్దీని క్రమబద్ధీకరిస్తున్నామని సీపీ సాయిచైతన్య...

    SP Rajesh Chandra | మహిళకు ఉరి కేసులో ఒకరి అరెస్ట్

    అక్షరటుడే, కామారెడ్డి : SP Rajesh Chandra | మహిళను చీర కొంగుతో ఉరివేసి హత్య చేసిన నిందితుడిని...