అక్షరటుడే, వెబ్‌డెస్క్ : PM Modi | దేశ విభజన అత్యంత విషాదకర అధ్యయమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. భారత్, పాకిస్తాన్ విడిపోయిన ఆగస్టు 14వ తేదీని గుర్తు చేసుకుంటూ ఆయన గురువారం ఎక్స్‌లో ఓ పోస్టు పెట్టారు. లక్షలాది మంది అనుభవించిన తిరుగుబాటు, బాధను ఈ సందర్భంగా ఆయన గుర్తుచేసుకున్నారు.
విభజనను చరిత్రలో ఒక విషాదకరమైన అధ్యాయంగా అభివర్ణించారు. లక్షలాది మంది తమ ఇళ్లను వదిలి వెళ్ళవలసి రావడంతో చెప్పలేని బాధను ప్రస్తావించారు. “భారతదేశం విభజన భయానక జ్ఞాపక దినోత్సవాన్ని జరుపుకుంటుంది, మన చరిత్రలోని ఆ విషాద అధ్యాయంలో లక్షలాది మంది ప్రజలు అనుభవించిన తిరుగుబాటు, బాధను గుర్తుచేసుకుంటుంది. ఇది వారి ధైర్యాన్ని గౌరవించే రోజని” ప్రధాని(Prime Minister Modi) పేర్కొన్నారు. జాతి ఐక్యత గురించి ఆయన గుర్తు చేస్తూ.. దేశంలో సామరస్యాన్ని బలోపేతం చేయాలని ప్రజలను కోరారు. “బాధితులైన వారిలో చాలా మంది తమ జీవితాలను పునర్నిర్మించుకున్నారు. అద్భుతమైన మైలురాళ్లను సాధించారు. ఈ రోజు మన దేశాన్ని కలిపి ఉంచే సామరస్య బంధాలను బలోపేతం చేయడానికి విభజన మన బాధ్యతను కూడా గుర్తు చేస్తుంది” అని ఆయన తెలిపారు.
PM Modi | దేశాన్ని ముక్కలు చేసింది కాంగ్రెస్సే: అమిత్ షా
దేశ విభజన విషాదం కారణంగా బాధపడిన వారి బాధను గుర్తుచేసుకుంటూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా(Union Home Minister Amit Shah) సంతాపం వ్యక్తం చేశారు. దేశ విభజన హింస, దోపిడీ, దురాగతాలకు దారి తీసిందని, లక్షలాది మంది ప్రజలు వలస పోవాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. “విభజన భయానక జ్ఞాపక దినం. విభజన కారణంగా నష్టపోయిన వారి బాధను గుర్తుచేసుకుంటూ సంతాపం వ్యక్తం చేసే రోజు. కాంగ్రెస్ పార్టీ(Congress Party) దేశాన్ని ముక్కలుగా విభజించి, భారతమాత గర్వాన్ని దెబ్బతీసింది. విభజన హింస, దోపిడీ, దురాగతాలకు దారి తీసిందిజ. లక్షలాది మందిని వలస పోయేలా చేసింది. దేశం విభజన చరిత్ర, బాధను ఎప్పటికీ మరచిపోదని” షా X లో పోస్టు చేశారు.
మరోవైపు, కేంద్ర ఆరోగ్య మంత్రి, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జగత్ ప్రకాష్ నడ్డా(Jagat Prakash Nadda) కూడా దీనిపై స్పందించారు. దేశ వ్యతిరేక శక్తులకు తగిన సమాధానం ఇవ్వాలని పిలుపునిచ్చారు. “1947 నాటి చీకటి రోజు. చెప్పలేనంత బాధను అనుభవించి, అమానవీయ హింసను భరించి, ఇళ్ళు, ఆస్తులు, జీవితాలను కోల్పోయిన ఆ క్రూరమైన సంఘటనను గుర్తు చేస్తుందని” పేర్కొన్నారు. దేశ విభజన జ్ఞాపకాలను సజీవంగా ఉంచడానికి ఈ రోజును జరుపుకునే సంప్రదాయం దేశ నిర్మాణంలో ఒక ముఖ్యమైన అడుగు అని ఆయన పేర్కొన్నారు.