ePaper
More
    Homeఅంతర్జాతీయంIran | ఇరాన్‌కు ఆమె శాపమే తగిలిందా..? నెట్టింట వైరల్​ అవుతున్న 2004 నాటి విషాద...

    Iran | ఇరాన్‌కు ఆమె శాపమే తగిలిందా..? నెట్టింట వైరల్​ అవుతున్న 2004 నాటి విషాద గాథ

    Published on

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Iran : అది ఆగస్టు 15, 2004 ఉదయం.. ఇరాన్‌లోని నేకా నగరం.. అందరూ చూస్తుండగానే ఓ 16 ఏళ్ల బాలికను బహిరంగ కూడలిలో ఉరితీశారు. దీంతో ఒక్కసారిగా ఇరాన్​తోపాటు ప్రపంచ దేశాలు గొంతెత్తాయి. ఆ అమ్మాయికి జరిగింది దారుణమంటూ నిరసన తెలిపాయి.

    ఆ అమ్మాయి పేరు అతేఫా సహాలేహ్‌(Atefa Sahaleh). ఇరాన్ న్యాయస్థానం ఆమెకు అమలు చేసిన ఉరిశిక్ష సంచలనం రేపింది. తాజాగా ఇరాన్​ ఇజ్రాయెల్ మధ్య నెలకొన్న​ ఉద్రిక్తతల పరిస్థితుల నేపథ్యంలో మళ్లీ ఇన్నేళ్లకు ఆ బాలిక అతేఫా గురించిన చర్చ నెట్టింట సాగుతోంది. ఇరాన్ తాజా దుస్థితికి ఆమె మరణమే కారణమంటూ నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు. ఇస్లామిక్ పాలనను ఆ బాలిక శపించిందనే వాదనలతో ఆమె కథ ప్రస్తుతం విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. నాటి ఆ ఘటన తర్వాత ఇరాన్​ను వరుస విషాదాలు వెంటాడుతున్నాయని, ఆ దేశం వారు మనశ్శాంతి కోల్పోయారని చెబుతున్నారు.

    Iran : అసలేం జరిగిందంటే..

    ఆగస్టు 15, 2004 ఉదయం.. ఇరాన్‌లోని నేకా(Neka) నగరంలోని బహిరంగ కూడలి.. అందరూ చూస్తుండగా అతేఫా సహాలేహ్‌ను ఉరితీశారు. “పవిత్రతకు వ్యతిరేకంగా చేసిన నేరాలకు శిక్ష” అంటూ ఆమెకు మరణశిక్ష విధించారు. కోర్టు ఆ అమ్మాయి వయసును 22 ఏళ్లని, వ్యభిచారానికి పాల్పడిందని పేర్కొంది.

    కానీ, అతేఫాకు వివాహమే కాలేదు. ఆమె వయసు కూడా కేవలం 16 ఏళ్లు మాత్రమే అనేది కొందరి వాదన. ఇరానియన్ చట్టం ప్రకారం, 18 ఏళ్ల కంటే తక్కువ వయసు ఉన్నవారిని ఉరితీయొద్దు. కానీ, ఆ బాలికను ఉరి తీసేందుకు ఇరానియన్ కోర్టు ఆమె వయసును తప్పుగా చూపిందనే ఆరోపణలు ఉన్నాయి.

    Iran : సోషల్ మీడియాలో చర్చ

    జూన్ 17న, ఒక భారత్​ నెటిజన్​ ఎక్స్ వేదికగా ఆ బాలిక గాథను వివరంగా షేర్​ చేశారు. తన పోస్ట్‌లో, “ఈ అమ్మాయిని ఉరితీసినప్పటి నుంచి ఇరాన్‌లో ఎప్పుడూ శాంతి లేకుండా పోయింది. అందుకే ఇరాన్‌ను ఈ బాలిక శపించిందని ప్రజలు చెబుతున్నారు” అని చెప్పుకొచ్చారు.

    ఈ కథ వివరించిన నెటిజన్​.. తనదైన శైలిలో ప్రశ్నలు సంధించారు.. “ఇదెక్కడి న్యాయం..? ఇదేం చట్టం..? ఇస్లామిక్​ దేశాలలో ముస్లిం మహిళల జీవితాల వాస్తవ చిత్రం ఇంత దారుణమా..?” అని ప్రశ్నించారు. ఇరాన్ వెలుపలి ప్రపంచానికి చేరిన ఇలాంటి కేసు ఇది ఒక్కటేనని, ఇరాన్(IRAN), ఇరాక్(Iraq), పాకిస్తాన్( Pakistan), ఆఫ్ఘనిస్తాన్(Afghanistan), ఉజ్బెకిస్తాన్(Uzbekistan) వంటి అనేక దేశాలలో క్రూరమైన చట్టాల కారణంగా ఇలా చాలా మంది అమాయక బాలికల ప్రాణాలు పోతున్నాయంటూ పోస్ట్ చేశారు.

    Iran: ఇరాన్‌లో మహిళల హక్కులు

    నాటి ఈ బాలిక ఉరిశిక్ష ప్రపంచాన్నే దిగ్భ్రాంతికి గురిచేసింది. మహిళలను లక్ష్యంగా చేసుకునే దుర్మార్గపు పాలనను ఇది బయటపెట్టింది. ఇరాన్‌లో మహిళల హక్కులు పూర్తిగా కాలరాస్తున్నారనే వాదన ఉంది. 2022లో, పోలీసుల కస్టడీలో మహ్సా అమి అనే యువతి మరణించిన తర్వాత, దేశంలో మహిళలపై జరుగుతున్న క్రూరత్వానికి నిరసనగా ‘జాన్, జెండెగి, ఆజాది’ (స్త్రీ, జీవితం, స్వేచ్ఛ) అనే ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడిన విషయం తెలిసిందే.

    More like this

    Stock Market | జీఎస్టీ ఊతం.. లాభాల్లో సూచీలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ ​: Stock Market | దేశీయ స్టాక్‌ మార్కెట్ల(Domestic Stock Markets)కు జీఎస్టీ సంస్కరణలు ఊతమిచ్చాయి....

    Supreme Court | ఠాణాల్లో ప‌ని చేయ‌ని సీసీ కెమెరాలు.. సుమోటోగా స్వీక‌రించిన సుప్రీంకోర్టు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Supreme Court | దేశంలోని అనేక పోలీసుస్టేష‌న్ల‌లో సీసీ కెమెరాలు ప‌ని చేయ‌క పోవ‌డంపై...

    Banswada | ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి

    అక్షరటుడే, బాన్సువాడ : Banswada | తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దులో బుధవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటు...