అక్షరటుడే, వెబ్‌డెస్క్ : US Trade Deal | భారత్, అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందంపై ప్రకటనతో మార్కెట్లో ఉత్సాహం నెలకొంది. గ్లోబల్ మార్కెట్లన్నీ (Global Markets) పరుగులు తీనున్నాయి. రూపాయి విలువ బలపడడం, క్రూడ్ ఆయిల్ (Crude Oil) ధర దిగిరావడంతో ఒక్క సెషన్లోనే ప్రధాన సూచీలు రికార్డు స్థాయి గరిష్టాలకు చేరువయ్యాయి. మంగళవారం ఉదయం సెన్సెక్స్ 3,657 పాయింట్ల లాభంతో మరో 54 పాయింట్లు పెరిగింది. గరిష్టాల వద్ద ప్రాఫిట్ బుకింగ్‌తో 2,370 పాయింట్లు పడిపోయింది.
నిఫ్టీ 1,220 పాయింట్ల లాభంతో ప్రారంభమై మరో 33 పాయింట్లు పైకి ఎగబాకింది. ఇంట్రాడే గరిష్టాలనుంచి 700 పాయింట్లు పతనమైంది. మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో సెన్సెక్స్ 2,440 పాయింట్ల లాభంతో 84,107 వద్ద, నిఫ్టీ 748 పాయింట్ల లాభంతో 25,837 వద్ద ఉన్నాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్, నిఫ్టీ (Nifty) గరిష్టంగా ఐదు శాతానికి పైగా పెరిగి గత ఐదేళ్లలో అత్యుత్తమ రోజును నమోదు చేశాయి. రూపాయి ఒక శాతానికి పైగా పెరిగి 2022 తర్వాత అత్యుత్తమ సెషన్‌గా నిలిచింది.
అన్ని రంగాల్లో దూకుడు..
క్యాపిటల్ గూడ్స్, ఇండస్ట్రియల్, యుటిలిటీ, పవర్, ఫార్మా, ఫైనాన్షియల్ సర్వీసెన్, బ్యాంకింగ్, కన్జూమర్ డ్యూరెబుల్, ఆటో, ఐటీ, టెలికాం రంగాల షేర్లు భారీ లాభాలతో దూసుకుపోతున్నాయి.
Top Gainers : బీఎస్ఈ సెన్సెక్స్ మొత్తం 30 స్టాక్స్ లాభాలతో ట్రేడ్ అవుతున్నాయి. అదానీ పోర్ట్స్ 8.01 శాతం, బజాజ్ ఫైనాన్స్ 5.71 శాతం, పవర్‌గ్రిడ్ 4.96 శాతం, బజాజ్ ఫిన్సర్వ్ 4.83 శాతం, ఎటర్నల్ 4.69 శాతం లాభాలతో ఉన్నాయి.