అక్షరటుడే, వెబ్డెస్క్: Cold wave | రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే చలితో ప్రజలు వణికి పోతున్నారు. కాగా, వాతావరణ శాఖ (Meteorological department) అధికారులు తాజాగా మరో షాకింగ్ న్యూస్ ఇచ్చారు.
రాష్ట్రవ్యాప్తంగా రానున్న రెండు రోజులు చలితీవ్రత అధికంగా ఉంటుందని హెచ్చరించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. హైదరాబాద్ నగరంలో (Hyderabad city) సహా అన్ని ప్రాంతాల్లో రాత్రి పూట ఉష్ణోగ్రతలు భారీగా పడిపోనున్నాయి. తెల్లవారుజామున రికార్డు స్థాయిలో అతితక్కువ టెంపరేచర్ నమోదు అయ్యే అవకాశం ఉంది. హైదరాబాద్ నగరంలో 6-8 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రతకు పడిపోయే ఛాన్స్ ఉంది. తెలంగాణలోని మిగతా ప్రాంతాల్లో 5 నుంచి 8 డిగ్రీలకు కనిష్ట ఉష్ణోగ్రతలు (temperatures) పడిపోతాయి.
Cold wave | | అప్రమత్తంగా ఉండాలి
రానున్న రెండు రోజులు ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు. రాత్రి, తెల్లవారుజామున ప్రయాణాలు చేయకపోవడం ఉత్తమం. అత్యవసరం అయితే తప్ప బయటకు వెళ్లొద్దు. బయటకు వెళ్లాల్సి వస్తే తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. వెచ్చని దుస్తులు ధరించాలి. రానున్న రోజుల్లో చలి తీవ్రత ఇలాగే కొనసాగుతుందని అధికారులు తెలిపారు.