అక్షరటుడే, వెబ్డెస్క్: TET 2026 Key | తెలంగాణ టెట్ –2026 ప్రైమరీ కీ (Telangana TET – 2026 preliminary key) శుక్రవారం విడుదల అయింది. పరీక్షలకు సంబంధించిన కీ, రెస్పాన్స్ షీట్లను అధికారులు విడుదల చేశారు.
రాష్ట్రంలో ఈ నెల 3 నుంచి 20 వరకు టెట్ పరీక్షలు (TET examinations) జరిగాయి. ఆన్లైన్ విధానంలో పరీక్షలు నిర్వహించారు. ఈ క్రమంలో తాజాగా అధికారులు ప్రాథమిక కీ విడుదల చేశారు. అభ్యంతరాలు తెలిపేందుకు ఫిబ్రవరి 1న సాయంత్రం 5 గంటల వరకు అవకాశం కల్పించారు. అభ్యంతరాలను పరిశీలించిన అనంతరం ఫైనల్ కీ విడుదల చేయనున్నారు. టెట్ పేపర్–1, పేపర్–2 పరీక్షలకు మొత్తం 2.37 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. 15 సెషన్లలో పరీక్షలు జరగ్గా 1,95,181 మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరు అయ్యారు. 71,670మంది ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులు పరీక్షకు దరఖాస్తు చేయగా.. 90.27 శాతం మంది పరీక్షలకు హాజరు అయ్యారు.
గతంలో టెట్ పరీక్షలు అప్పుడప్పుడు నిర్వహించేవారు. నిర్ణిత గడువు అంటూ ఉండేది కాదు. అయితే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఏడాదికి రెండు సార్లు టెట్ నిర్వహిస్తామని తెలిపింది. ఈ క్రమంలో గతేడాది జూన్లో పరీక్షలు జరగాయి. అనంతరం నవంబర్లో మరోసారి ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చింది. ఈ పరీక్షలు జనవరిలో నిర్వహించారు. ఫిబ్రవరి మొదటి వారంలో టెట్ పరీక్ష ఫలితాలు విడదలయ్యే అవకాశం ఉంది.