అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Teacher Suspended | ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్ (Smart Phone) యుగంలో చిన్నా పెద్ద తేడా లేకుండా అందరూ స్మార్ట్ ఫోన్‌కు బానిసలుగా మారుతున్నారు. విద్యార్థులు, టీచర్లు సైతం సోషల్ మీడియా (Social Media)లో లీనం అవుతున్నారు. అయితే ఓ ప్రభుత్వ టీచర్ ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రైవేట్ పాఠశాలలను ప్రమోట్ చేస్తూ రీల్స్ చేశారు.
ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ చేస్తూ చాలా మంది డబ్బులు సంపాదిస్తున్నారు. ఇన్ఫ్లూయెన్సర్లుగా వివిధ వస్తువులు, దుకాణాలను ప్రమోట్ చేస్తూ డబ్బులు తీసుకుంటున్నారు. అలాగే ఓ టీచర్ సైతం ఇన్‌స్టాలో రీల్స్‌తో ఫేమస్ అయింది. ప్రభుత్వ ఉపాధ్యాయురాలైన ఆమె రీల్స్ (Reels) చేస్తూ సోషల్ మీడియాలో ఇన్ఫ్లూయెన్సర్గా మారింది. అంతేగాకుండా పలు ప్రైవేట్ బడులను ప్రమోట్ చేస్తూ వీడియోలు తీసింది. ఈ విషయం ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో ఆమెను సస్పెండ్ చేశారు.
Teacher Suspended | ట్రోల్ చేస్తున్నారని రోదన
ఖమ్మం (Khammam) జిల్లా మామిళ్లగూడెం ఉన్నత పాఠశాలలో గౌతమి ఇంగ్లిష్ టీచర్‌గా పని చేస్తున్నారు. ఆమె ప్రైవేట్ విద్యాసంస్థలు, వ్యాపార సంస్థల ప్రమోషన్స్ కోసం యాడ్స్ చేశారు. వాటిని తన ఇన్‌స్టాలో షేర్ చేశారు. దీంతో ఉన్నతాధికారులు ఆమెను సస్పెండ్ చేశారు. అయితే తనను సస్పెండ్ చేయడంపై గౌతమి సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ఈ మేరకు ఓ వీడియో పోస్ట్ చేశారు. ప్రైవేట్ విద్యా సంస్థలను ప్రమోట్ చేయాలనే విషయం తనకు తెలియదన్నారు. ఈ విషయం తెలియక చేశానని చెప్పారు. అయితే తనను ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, వాట్సాప్‌లో కొందరు ట్రోల్ చేస్తున్నారని ఆమె రోదించారు. ఈ ట్రోలింగ్ చూస్తుంటే ఆత్మహత్య చేసుకోవాలని ఉందని కంటతడి పెట్టుకున్నారు.