HomeతెలంగాణTeacher Suspension | పూటుగా తాగొచ్చి క్లాస్​ రూంలో పడుకున్న టీచర్​.. తర్వాత ఏం జరిగిందంటే?

Teacher Suspension | పూటుగా తాగొచ్చి క్లాస్​ రూంలో పడుకున్న టీచర్​.. తర్వాత ఏం జరిగిందంటే?

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Teacher Suspension | కొందరు ప్రభుత్వ ఉపాధ్యాయుల (Teachers) తీరుతో అందరికీ చెడ్డ పేరు వస్తోంది. ప్రభుత్వం విద్యా రంగానికి రూ. వేల కోట్లు కేటాయిస్తున్నా.. కొందరు టీచర్ల తీరుతో ప్రజలు పిల్లలను సర్కార్​ బడులకు పంపడానికి ఆలోచిస్తున్నారు.

ప్రభుత్వ పాఠశాలల (Govt Schools) అభివృద్ధికి ఏటా ప్రభుత్వం అనేక నిధులను కేటాయిస్తోంది. అయితే కొందరు టీచర్లు పాఠశాలలకు సక్రమంగా వెళ్లడం లేదు. మరికొందరు వెళ్లినా విద్యార్థులను పట్టించుకోవడం లేదు. కొందరు ఉపాధ్యాయులు బడికి వెళ్లి వ్యాపారాల గురించే ఆలోచిస్తారని, విద్యార్థులను పట్టించుకోరనే ఆరోపణలు ఉన్నాయి. అయితే ఇటీవల ఓ ఉపాధ్యాయుడు పూటుగా మద్యం తాగి బడికి వచ్చాడు.

Teacher Suspension | విద్యార్థుల ముందే..

ఉపాధ్యాయులు క్రమశిక్షణతో ఉంటేనే విద్యార్థులు గౌరవిస్తారు. వారిని అనురిస్తారు. అయితే ఓ ఉపాధ్యాయుడు మద్యం తాగి బడికి వచ్చాడు. అంతేగాకుండా తరగతి గదిలో విద్యార్థుల (Students) ముందు నేలపై పడుకున్నాడు. ఈ ఘటన ఆసిఫాబాద్​ (Asifabad) జిల్లా జైనూరు మండలం సుకుత్​పల్లిలో చోటు చేసుకుంది. పాఠశాలలో ఎస్​జీటీగా పని చేస్తున్న జే విలాస్‌ ఇటీవల తాగి బడికి వచ్చాడు. ఈ విషయాన్ని పలువురు విద్యార్థులు తమ తల్లిదండ్రులకు తెలిపారు. దీంతో వారు బడికి చేరుకొని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉపాధ్యాయుడి తీరుపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు.

Teacher Suspension | విచారణ చేపట్టి..

ఉపాధ్యాయుడిపై ఫిర్యాదు రావడంతో పాటు, వీడియో వైరల్​ కావడంతో ఉన్నతాధికారులు చర్యలు చేపట్టారు. జిల్లా గిరిజన సంక్షేమ శాఖ ఉపసంచాలకులు రమాదేవి ఈ ఘటనపై విచారణ చేపట్టారు. అనంతరం ఎస్జీటీ విలాస్​ను సస్పెండ్​ చేస్తూ ఆమె ఉత్తర్వులు జారీ చేశారు. కాగా విద్యార్థులకు ఆదర్శంగా నిలవాల్సిన ఉపాధ్యాయుడు, ఇలా చేయడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.