అక్షరటుడే, తమిళనాడు : Thirupparankundram Lamp Lighting Row | మద్రాస్ హైకోర్టు (Madras High Court)లో తమిళనాడు ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. తిరుప్పరం కుండ్రం దేవస్థానం దీపం వివాదంలో హిందూ సంస్థలకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వ పిటిషన్‌ను హైకోర్టు తిరస్కరించించింది. తిరుప్పరం కుండ్రం దీపం కేసులో సింగిల్ బెంచ్ జడ్జి తీర్పును ధర్మాసనం సమర్థించింది. తిరుప్పరం కుండ్రం దేవస్థానం దీపం వెలిగించవచ్చన్ని పేర్కొంది. స్టాలిన్ ప్రభుత్వం (Stalin Government)పై ఆగ్రహం వ్యక్తం చేసింది. దీపం వివాదంపై రాజకీయాలు తగదని సూచించింది.
Thirupparankundram Lamp Lighting Row | ధర్మాసనం ఏమందంటే..
జస్టిస్ జి.జయచంద్రన్, జస్టిస్ కేకే రామకృష్ణన్‌లతో కూడిన ధర్మాసనం తీర్పును వెలువరించింది. దర్గా సమీపంలో ఉన్న ‘దీపత్తూణ్’ (Deepathoon)అని పిలువబడే రాతి స్తంభం ఉన్న ప్రదేశం శ్రీ సుబ్రమణ్యస్వామి ఆలయానికి చెందినదేనని ధర్మాసనం స్పష్టం చేసింది. అక్కడ జరిగే ఏ కార్యక్రమమైనా చట్ట నిబంధనలకు లోబడి ఉండాలని ధర్మాసనం పేర్కొంది. భారత పురావస్తు శాఖ (Archaeological Survey of India) తో సంప్రదింపులు జరిపి, దీపం వెలిగించేందుకు అనుమతి ఇవ్వవచ్చని తెలిపింది. వెళ్లే వ్యక్తుల సంఖ్యను నిర్ణయించవచ్చని కోర్టు స్పష్టం చేసింది.
Thirupparankundram Lamp Lighting Row | తీర్పును స్వాగతించిన హిందూ సంఘాలు
తీర్పును స్వాగతిస్తూ పిటిషనర్ రామ రవికుమార్ మాట్లాడుతూ.. ఇది మురుగన్ భక్తులకు గొప్ప విజయమని అన్నారు. హిందూ మున్నాని నాయకుడు, పిటిషనర్ రాజేష్ మాట్లాడుతూ.. “కోర్టు అద్భుతమైన తీర్పు ఇచ్చింది. ప్రభుత్వం దాఖలు చేసిన అప్పీల్‌ను కోర్టు కొట్టివేసింది. దీపత్తూణ్ వద్ద దీపం వెలిగించాల్సి ఉంది. ఆలయ పరిపాలన దానికి అవసరమైన ఏర్పాట్లు చేయాలి. ఇది తమిళనాడు హిందువులు, మురుగన్ భక్తులకు, విద్యార్థులకు గొప్ప విజయం” అని అన్నారు.
Thirupparankundram Lamp Lighting Row | తిరుప్పరంకుండ్రం వివాదం ఏమిటంటే..
తిరుప్పరంకుండ్రం కొండపై పురాతన శిలాశాసన ఆలయం ఉంది. ఇది ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతోంది. అదే కొండపై ఒక దర్గా సైతం ఉంది. ఆలయం, దర్గా మధ్య 1920 నుంచి వివాదాలు కొనసాగుతున్నాయి. అయితే కొండ యాజమాన్యంపై అప్పట్లో న్యాయపోరాటం జరిగింది. సివిల్ కోర్టు (Civil Court) ఇచ్చిన తీర్పును ప్రివీ కౌన్సిల్ సమర్థించింది. దర్గాకు సంబంధించిన కొన్ని ప్రాంతాలు మినహా మిగతా కొండంతా సుబ్రమణ్యస్వామి ఆలయానిదేనని అప్పటి తీర్పులు స్పష్టం చేశాయి. అయితే ఆ తీర్పులు ఆచారాలు, దీపం వెలిగించే సంప్రదాయంపై మాత్రం స్పష్టత ఇవ్వలేదు. తాజా తీర్పులో ధర్మాసనం దీపం వెలిగించవచ్చని పేర్కొంది.
Madurai, Tamil Nadu: Rajesh, Petitioner and Hindu Makkal Katchi (HMK) leader, says, “The court has delivered a remarkable verdict. The government’s appeal petition has been dismissed. The lamp should be lit on a Deepathoon and the temple administration should make the necessary… https://t.co/GL8IbBjNF1 pic.twitter.com/bhpiKEnNTf
— ANI (@ANI) January 6, 2026