అక్షరటుడే, వెబ్‌డెస్క్: Tahsildar Suspended | ప్రభుత్వ భూములను కాపాడాల్సిన రెవెన్యూ అధికారులు అక్రమ పట్టాలు చేస్తున్నారు. లంచాలు తీసుకొని ప్రభుత్వ భూములకు పట్టా చేస్తున్నారు.ఖమ్మం జిల్లా (Khammam District) పెనుబల్లి తహశీల్దార్ శ్రీనివాస్ యాదవ్‌ను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు.
ప్రభుత్వ భూమికి అక్రమ పట్టా చేశారన్న ఆరోపణల నేపథ్యంలో చర్యలు తీసుకున్నారు. ఆయనతో పాటు చింతగూడెం (Chintagudem) గ్రామ పరిపాలన అధికారి రవిని సస్పెండ్ చేశారు. ప్రభుత్వ భూమిని అక్రమ పట్టా చేసినందుకు సంబంధిత వ్యక్తుల నుంచి రూ.40 లక్షల లంచం తీసుకున్నట్లు ఎమ్మార్వో శ్రీనివాస్ యాదవ్‌పై ఆరోపణలు వచ్చారు.
Tahsildar Suspended | రూ.5 కోట్ల విలువైన భూమి
పెనుబల్లి మండలం (Penuballi Mandal) చింతగూడెం రెవెన్యూ పరిధిలోని సర్వే నెంబర్ 71/3,73/4 లో 3.20 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. ఇందులో 1.20 ఎకరాలను తహశీల్దార్ ప్రైవేట్ వ్యక్తులకు రిజిస్ట్రేషన్ చేశాడు. ఆ భూమి విలువ రూ.5 కోట్ల వరకు ఉంటుందని అంచనా. దీనిపై గ్రామస్తులు సబ్ కలెక్టర్ (Sub-Collector)కు ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టిన అధికారులు చర్యలు చేపట్టారు. తహశీల్దార్‌తో పాటు, జీపీవోపై వేటు వేశారు.
Tahsildar Suspended | యథేచ్ఛగా అవినీతి
రాష్ట్రంలో పలువురు తహశీల్దార్లు యథేచ్ఛగా అవినీతికి పాల్పడుతున్నారు. రైతులను లంచాల పేరిట వేధిస్తున్నారు. అలాగే ఆక్రమణలకు పాల్పతున్న వారికి అండగా నిలుస్తున్నారు. ప్రభుత్వ భూములను రక్షించాల్సిన వారే డబ్బులు తీసుకొని కళ్లు మూసుకుంటున్నారు. మెదక్ జిల్లా (Medak District)లోని ఓ తహశీల్దార్ భారీగా అవినీతికి పాల్పడుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. తన సోదరుడిని కారు డ్రైవర్‌గా పెట్టుకొని భారీగా వసూళ్లు చేస్తున్నట్లు సమాచారం. నేరుగా డబ్బులు తీసుకోకుండా.. మరో ప్రైవేట్ వ్యక్తి ద్వారా తన సోదరుడితో అక్రమ లావాదేవీలు నిర్వహిస్తున్నట్లు సమాచారం. సదరు తహశీల్దార్‌పై చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.