ePaper
More
    Homeజిల్లాలుకామారెడ్డిYellareddy | ముగ్గురి ప్రాణం తీసిన ఈత సరదా..

    Yellareddy | ముగ్గురి ప్రాణం తీసిన ఈత సరదా..

    Published on

    అక్షరటుడే, ఎల్లారెడ్డి: Yellareddy | ఈత సరదా ముగ్గురు ముగ్గురు యువకులు ప్రాణాలను బలిగింది. నిజాంసాగర్​ ప్రాజెక్ట్(Nizamsagar Project)​ బ్యాక్​ వాటర్​ వద్ద సోమవారం సాయంత్రం ముగ్గురు గల్లంతైన విషయం తెలిసిందే. వారి కోసం గాలింపు చర్యలు చేపట్టగా మంగళవారం మృతదేహాలు లభ్యమయ్యాయి. 16 గంటల పాటు పోలీసులు(Police), రెస్క్యూటీం(rescue team), గజ ఈతగాళ్లు(swimmers) కలిసి శ్రమించి వారి మృతదేహాలను బయటకు తీశారు. బొగ్గుగుడిసెకు చెందిన మధుకర్​ గౌడ్​(18), తిమ్మారెడ్డి గ్రామానికి చెందిన ఐతే నవీన్​(21), సోమార్​పేట్​కు చెందిన బెస్త హర్షవర్ధన్​(17)లు మరికొందరు యువకులతో కలిసి సోమార్​పేట్​ సమీపంలో క్రికెట్​ ఆడేందుకు వెళ్లారు. అనంతరం యువకులంతా నిజాంసాగర్​ బ్యాక్​ వాటర్​లో స్నానం చేసేందుకు నీటిలో దిగారు.

    అయితే అందులో ముగ్గురు యువకులు మధుకర్​ గౌడ్​, నవీన్​, హర్షవర్ధన్​ మాత్రం నీళ్లలో గల్లంతయ్యారు. దీంతో మిగతావారు సమాచారం ఇవ్వగా పోలీసులు అక్కడికి చేరుకుని గజ ఈతగాళ్లతో సోమవారం అర్ధరాత్రి వరకు వెతికించారు. మంగళవారం ఉదయం ఒకరి మృతదేహం లభ్యం కాగా.. మధ్యాహ్నానికి మిగతా ఇద్దరి మృతదేహాలు లభ్యమయ్యాయి. మృతదేహాలను చూసి వారి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. బాధిత కుటుంబాలను కాంగ్రెస్​ నాయకులు(Congress Leaders) కురుమ సాయిబాబా, విద్యాసాగర్​, సామెల్​, శ్రీనివాస్​రెడ్డి, ప్రశాంత్​గౌడ్​, తిరుపతి, ననుగొండ శ్రీనివాసులు ఓదార్చారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు బాన్సువాడ రూరల్ సీఐ రాజేశ్​(CI Rajesh) తెలిపారు.

    Yellareddy | బాధిత కుటుంబాలను పరామర్శించిన ఎమ్మెల్యే

    నిజాంసాగర్​ బ్యాక్​వాటర్(Nizamsagar Back Water)​లో ఈతకు వెళ్లి మృతి చెందిన ముగ్గురు యువకుల కుటుంబాలను ఎమ్మెల్యే మదన్​మోహన్(MLA Madan Mohan) పరామర్శించారు. యువకుల మృతదేహాలకు నివాళులర్పించి కుటుంబసభ్యులు ఆర్థిక సాయం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. చేతికి అందివచ్చిన కొడుకులు అకాల మరణం చెందడం తల్లిదండ్రులకు గుండెకోతేనన్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్​(Collector)కు సూచించారు.

    Yellareddy | మాజీ ఎమ్మెల్యే నల్లమడుగు సురేందర్..

    బాధిత కుటుంబాలను మాజీ ఎమ్మెల్యే నల్లమడుగు సురేందర్​(Former MLA Nallamadugu Surender) పరామర్శించారు. ఎల్లారెడ్డి ప్రభుత్వాస్పత్రికి చేరుకుని కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఘటనా జరిగిన ప్రదేశంలో పోలీసు, రెవెన్యూ సిబ్బంది ఎలాంటి ఏర్పాట్లు చేయలేదని వారిపై మాజీ ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. పోస్టుమార్టం నిర్వహించి త్వరగా మృతదేహాలను వారి కుటుంబసభ్యులకు అప్పగించాలని ఆయన అధికారులకు సూచించారు.

    More like this

    Indur | నిజామాబాద్​లో దారుణం.. ఉరేసుకుని యువకుడి ఆత్మహత్య

    అక్షరటుడే, ఇందూరు: Indur : నిజామాబాద్ జిల్లా కేంద్రంలో headquarters దారుణం చోటుచేసుకుంది. నగరంలోని పంచాయతీ రాజ్ కాలనీలో...

    Gold Prices Hike | పసిడి పరుగులు.. నాన్‌స్టాప్‌గా పెరుగుతున్న ధ‌ర‌లు!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Gold Prices Hike : ఇటీవ‌లి కాలంలో బంగారం, వెండి ధ‌ర‌లు Silver Prices అంత‌కంత...

    Wallstreet | లాభాల్లో గ్లోబల్‌ మార్కెట్లు.. గ్యాప్‌ అప్‌ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్‌ నిఫ్టీ

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Wallstreet : వాల్‌స్ట్రీట్‌(Wallstreet)లో జోరు కొనసాగుతుండగా.. యూరోప్‌ మార్కెట్లు మాత్రం మిక్స్‌డ్‌గా ముగిశాయి. బుధవారం ఉదయం...