ePaper
More
    HomeతెలంగాణKrishna River | ఉప్పొంగుతున్న కృష్ణ‌మ్మ.. వెల‌వెల‌బోతున్న‌ గోదారమ్మ‌..

    Krishna River | ఉప్పొంగుతున్న కృష్ణ‌మ్మ.. వెల‌వెల‌బోతున్న‌ గోదారమ్మ‌..

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Krishna River | కృష్ణ‌మ్మ ప‌ర‌వ‌ళ్లు తొక్కుతోంది. కొత్త నీటితో ఉవ్వెత్తున ఎగిసి ప్ర‌వ‌హిస్తోంది. ల‌క్ష క్యూసెక్కుల‌కు పైగా ప్ర‌వాహంతో దిగువ‌కు ప‌రుగులు పెడుతోంది. మ‌రోవైపు, గోదావ‌రి జ‌ల‌క‌ళ లేక బోసిపోతోంది. వ‌ర‌ద ప్ర‌వాహం లేక వెలవెల‌బోయి క‌నిపిస్తోంది. తెలుగు రాష్ట్రాల‌కు జీవ‌నాధార‌మైన రెండు ప్ర‌ధాన న‌దులు కృష్ణ‌(Krishna River), గోదావ‌రి (Godhavari) ప‌రివాహక ప్రాంతాల్లో భిన్న‌మైన ప‌రిస్థితి నెల‌కొంది.

    Krishna River | ఉరుకలెత్తుతోన్న కృష్ణ‌మ్మ‌..

    కృష్ణ న‌దీ ప‌రివాహక ప్రాంతంలో కురుస్తున్న భారీ వ‌ర్షాల‌తో వ‌ర‌ద ఉప్పొంగుతోంది. ఎగువ‌న ఉన్న క‌ర్ణాట‌క‌(Karnataka)లో విస్తృతంగా వ‌ర్షాలు కురుస్తుండ‌డంతో వ‌ర‌ద నీటితో కృష్ణ ప‌రుగులు పెడుతోంది. ప్రియ‌ద‌ర్శిని జురాల ప్రాజెక్టుకు 1.25 ల‌క్ష‌ల క్యూసెక్కుల వ‌ర‌ద వ‌చ్చి చేరుతోంది. ప్రాజెక్టు గేట్ల‌ను ఎత్తి దిగ‌వ‌కు వదిలి పెడుతున్నారు. ఈ జ‌లాలు శ్రీ‌శైలం ప్రాజెక్టు (Srisailam Project)కు చేర‌డంతో అక్క‌డ కూడా నాలుగు గేట్ల‌ను ఎత్తివేశారు. దీంతో నాగార్జున సాగర్ ప్రాజెక్ట్​కు భారీగా ఇన్‌ఫ్లో వ‌చ్చి చేరుతోంది. 1,16,424 క్యూసెక్కుల వ‌ర‌ద వ‌స్తుండ‌గా, 4,646 క్యూసెక్కుల ఔట్ ఫ్లో ఉంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 590.00 అడుగులు కాగా, ప్రస్తుతం 534.50 అడుగుల నీరు నిల్వ ఉంది.

    Krishna River | బోసిపోయిన ఎగువ గోదావ‌రి

    మ‌రోవైపు వ‌ర‌ద‌ల్లేక గోదావ‌రి బోసిపోయి క‌నిపిస్తోంది. మ‌హారాష్ట్ర‌(Maharashtra)లో పెద్ద‌గా వ‌ర్షాలు కురియ‌క పోవ‌డంతో వ‌ర‌ద ప్ర‌వాహాలు రావ‌డం లేదు. బాబ్లీ గేట్లు ఎత్తినా ఇప్ప‌టిదాకా శ్రీ‌రాంసాగ‌ర్ ప్రాజెక్టులోకి పెద్ద‌గా వర‌ద వ‌చ్చింది లేదు. ఎస్సారెస్పీ(SRSP)కి చెప్పుకోద‌గ్గ స్థాయిలో ఇన్‌ఫ్లో రావ‌డం లేదు. కేవ‌లం 4291 క్యూసెక్కులు మాత్ర‌మే వ‌చ్చి చేరుతోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1091 అడుగులు (80 టీఎంసీలు) కాగా, ప్ర‌స్తుతం 1067 అడుగులు (19.537 టీఎంసీలు) మాత్ర‌మే నీటి నిల్వ ఉంది. ఈ నెల‌లో కేవ‌లం 8 టీఎంసీల నీరు మాత్ర‌మే వ‌చ్చి చేరింది. ఎగువ‌న ఇలా ఉంటే, దిగువ గోదావ‌రిలో మాత్రం ప్ర‌వాహం కొన‌సాగుతోంది. మేడిగ‌డ్డ బ్యారేజ్ వ‌ద్ద 1.11 ల‌క్ష‌ల క్యూసెక్కుల వ‌ర‌ద ప్ర‌వ‌హిస్తోంది.

    More like this

    Revanth meet Nirmala | కళాశాలల్లో అత్యాధునిక ల్యాబ్​ల ఏర్పాటుకు రూ. 9 వేల కోట్లు..!

    అక్షరటుడే, హైదరాబాద్: Revanth meet Nirmala : తెలంగాణ విద్యా రంగంలో స‌మూల‌ మార్పులు తేవ‌డానికి తాము చేస్తున్న‌...

    Nara Lokesh | కేటీఆర్​ను కలిస్తే తప్పేంటి.. ఏపీ మంత్రి లోకేష్​ కీలక వ్యాఖ్యలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Nara Lokesh | మాజీ మంత్రి, బీఆర్​ఎస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్​ కేటీఆర్ (KTR)​ను కలిస్తే...

    Kamareddy | తల్లికి తలకొరివి పెట్టేందుకు కొడుకు వస్తే వెళ్లగొట్టిన గ్రామస్థులు.. ఎందుకో తెలుసా..?

    అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy | తల్లిని కంటికి రెప్పలా కాపాడుకొని ఆసరాగా ఉండాల్సిన కొడుకు ఇరవై ఏళ్ల క్రితం...