Homeజిల్లాలునిజామాబాద్​Dharpally | స్కూల్​కి ఫోన్​ తెచ్చాడని విద్యార్థికి టీసీ ఇచ్చి ఇంటికి పంపేశారు..!

Dharpally | స్కూల్​కి ఫోన్​ తెచ్చాడని విద్యార్థికి టీసీ ఇచ్చి ఇంటికి పంపేశారు..!

స్కూల్​కు సెల్​ఫోన్​ తీసుకొచ్చాడనే నెపంతో విద్యార్థికి టీసీ ఇచ్చి ఇంటికి పంపారు.. ఈ ఘటన ధర్పల్లి మండలంలోని దుబ్బాకలో చేసుకుంది.

- Advertisement -

అక్షరటుడే, ధర్పల్లి: Dharpally | స్కూల్​కు ఫోన్​ తీసుకొచ్చాడనే నెపంతో ఓ విద్యార్థికి టీసీ ఇచ్చి ఇంటికి పంపించేశారు. ఈ ఘటన ధర్పల్లి మండలంలో చోటు చేసుకుంది. బంజారా సేవా సంఘం (Banjara Seva sangham) నాయకులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని దుబ్బాక (dubbaka) గ్రామంలోని జిల్లా పరిషత్​ పాఠశాలలో గతనెల 20 తేదీన బతుకమ్మ సంబురాలు నిర్వహించారు.

ఈ కార్యక్రమాన్ని చిత్రీకరించేందుకు ఓ విద్యార్థి స్కూల్​కు ఫోన్​ తీసుకెళ్లాడు. దీంతో ఆగ్రహించిన హెచ్​ఎం ఆ విద్యార్థిని కొట్టి.. దూషించారని సంఘం నాయకులు ఆరోపించారు. అలాగే విద్యార్థికి టీసీ ఇచ్చి.. తల్లిదండ్రులను పోలీస్​స్టేషన్​ పిలిపించారని.. ఇది ఎంతవరకు సమంజసమని సంఘం నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా గురువారం సుమారు 30 మంది సల్పబండ తండావాసులు పాఠశాలకు వచ్చి హెచ్​ఎం నిర్వాకాన్ని ఖండించారు. పాఠశాలకు తరలివచ్చిన వారిలో మాజీ సర్పంచ్​ శర్మాన్​ నాయక్​, తండానాయక్​, శంకర్​ నాయక్​, కారోబార్​ బాద్యానాయక్​, అమనార్​, రమేష్​, గణేష్​ తదితరులు పాల్గొన్నారు.