4
అక్షరటుడే, వెబ్డెస్క్:Harish Rao | దేశం కోసం ప్రాణాలు త్యాగం చేస్తున్న సైనికుల(Soldiers) పోరాటమే మనకు స్ఫూర్తి అని మాజీ మంత్రి హరీశ్ రావు(Former Minister Harish Rao) అన్నారు. భారత్ – పాక్ ఉద్రిక్తతల నేపథ్యంలో భారత సైనికులకు మద్దతుగా మల్లారెడ్డి మెడికల్ కాలేజీ(Malla Reddy Medical College)లో నిర్వహించిన సంఘీభావ ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. దేశ ప్రజల భద్రతే తమకు ముఖ్యమన్నారు. మతం పేరు అడిగి టూరిస్టు(Tourist)లను చంపడం కలిచివేసిందన్నారు. ఇలాంటి సమయంలో యువత త్యాగానికి సిద్ధంగా ఉండాలని ఆయన సూచించారు. సైనికుల కుటుంబాలను కాపాడుకునే బాధ్యత ప్రజలపై ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి మల్లారెడ్డి, ఎమ్మెల్యేలు కేపీ వివేకానంద తదితరులు పాల్గొన్నారు.