అక్షరటుడే, గాంధారి: Gandhari | గాంధారి మండల కేంద్రంలో gandhari mandal ఆదివారం మధ్యాహ్నం వాతావరణం ఒక్కసారి చల్లబడింది. కొద్దిసేపు రాళ్ల వాన కురిసింది. అకస్మాత్తుగా వచ్చిన వర్షానికి రైతులు ఆందోళన చెందారు. తాము ఆరబెట్టిన ధాన్యంపై టార్ఫలిన్ కవర్లు (Tarpaulin covers) కప్పే సమయం కూడా లేకుండా ఒక్కసారిగా భారీగా వర్షం పడింది. దీంతో పలుచోట్ల ధాన్యం తడిసిపోయింది.