అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Stellant Securities India Ltd | స్టెల్లంట్ సెక్యూరిటీస్ ఇండియా లిమిటెడ్(Stellant Securities India Ltd) షేరు ప్రైస్ ఐదేళ్లుగా పరుగులు తీస్తూనే ఉంది.
ఈ ఏడాది మే మూడో వారంనుంచి నాన్‌స్టాప్‌గా ర్యాలీ(Non stop rally) కొనసాగుతోంది. ఐదేళ్ల క్రితం ఈ స్టాక్‌లో లక్ష రూపాయలు పెట్టుబడి పెట్టినవారి సంపద ప్రస్తుతం రూ. 1,18,82,940. అంటే వారి సంపద అక్షరాలా ఒక కోటీ 17 లక్షల 82 వేల 940 రూపాయలు పెరిగిందన్నమాట.
స్టెల్లంట్ సెక్యూరిటీస్ ఇండియా లిమిటెడ్‌ను 1991లో స్థాపించారు. ఇది కన్సల్టెన్సీ సేవలను అందించే వ్యాపారంలో ఉంది. నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ(NBFC) రిజిస్ట్రేషన్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి కంపెనీకి బోర్డు ఇటీవల గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీని ప్రకారం ఎన్‌బీఎఫ్‌సీ కార్యకలాపాలు, పెట్టుబడి, క్రెడిట్ కార్యకలాపాలు, లీజింగ్, హైర్‌పర్చేజ్ ఫైనాన్సింగ్‌లను చేర్చడానికి కంపెనీ ఆబ్జెక్ట్ క్లాజును విస్తరించనుంది. అలాగే ఇటీవలే జరిగిన కంపెనీ బోర్డు డైరెక్టర్స్ సమావేశంలో బోనస్ షేర్లు(Bonus shares) జారీకి ఆమోదం లభించింది. దీని ప్రకారం ఒక షేరు కలిగి ఉన్నవారికి నాలుగు షేర్లను ఉచితంగా అందించనున్నారు. దీనికి ఈనెల 12వ తేదీని రికార్డ్ డేట్‌గా ప్రకటించారు.
Stellant Securities India Ltd | మే 16 నుంచి పైపైకి..
ఈ స్టాక్ ధర(Stock price) మే 16 వ తేదీన రూ. 122.80 గా ఉంది. అప్పటినుంచి ఒక్క సెషన్‌లో కూడా నష్టాలతో ముగియలేదు. నాన్‌స్టాప్‌గా ర్యాలీ తీస్తున్న ఈ స్టాక్ ధర సెప్టెంబర్ 5వ తేదీ నాటికి రూ. 665.45 కు చేరుకుంది. అంటే ఈ ఏడాది మే 16వ తేదీన ఈ స్టాక్‌లో రూ. 1.22 లక్షలు పెట్టుబడి పెడితే ప్రస్తుతం రూ. 6.65 లక్షలు అయ్యింది.
Stellant Securities India Ltd | ఐదేళ్లలో స్టాక్ పనితీరు..
ఈ కంపెనీ 2006లో బీఎస్‌ఈ(BSE)లో లిస్టయ్యింది. అప్పటినుంచి ఐదేళ్ల క్రితం వరకు చెప్పుకోదగ్గ లాభాలను ఇవ్వలేదు. కానీ ఐదేళ్ల క్రితం ఈ స్టాక్‌లో పరుగులు ప్రారంభమయ్యాయి. 2020 సెప్టెంబర్ 9న రూ. 5.60 ఉన్న స్టాక్ ధర.. ఈ ఏడాది మే 16 నాటికి రూ. 122.80 కు చేరుకుంది. ఆ తర్వాత మరింత వేగంగా స్టాక్ ధర పెరగడం ప్రారంభమైంది. అప్పర్ సర్క్యూట్‌లు(Upper circuits) కొడుతూ పైపైకి వెళ్తూ గత సెషన్‌లో రూ. 665.45 వద్ద ముగిసింది. అంటే ఐదేళ్ల క్రితం ఈ స్టాక్‌లో లక్ష రూపాయలు పెట్టుబడి పెడితే అది ఇప్పుడు రూ. 1.18 కోట్లకు చేరేది.
స్టాక్ మార్కెట్ (Stock Market) రిస్క్‌తో కూడుకున్నది. ఫండమెంటల్‌గా బాగున్న స్టాక్ ఒక్కోసారి ఇన్వెస్టర్ల ఓపికను పరీక్షిస్తుంటుంది. ఎంతకీ స్టాక్ ప్రైస్ పెరక్కపోగా నష్టాలను అందిస్తుంటుంది. అయితే ఓపిక పడితే మంచి లాభాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. కానీ స్టాక్ ధరను చూసి ఇన్వెస్ట్ చేస్తే సంపద హరించుకుపోయే రిస్క్ ఉంటుంది. అప్పర్ సర్క్యూట్‌లు కొడుతూ వెళ్తున్న స్టాక్ వెంట పరుగులు తీయకపోవడమే మంచిది. దాని డౌన్ ట్రెండ్ ప్రారంభమైతే అమ్మడానికీ అవకాశం ఉండదన్న విషయాన్ని ఇన్వెస్టర్లు గమనించి పెట్టుబడులు పెట్టాలి.