ePaper
More
    HomeతెలంగాణAgriculture Minister | నాట్లు వేసేలోపే రైతుభరోసా.. రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన తుమ్మల

    Agriculture Minister | నాట్లు వేసేలోపే రైతుభరోసా.. రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన తుమ్మల

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Agriculture Minister | రైతు వ్యవసాయ రంగంలో అన్ని ఒడిదుడుకులను ఎదుర్కొని నిలదొక్కుకున్నప్పుడే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Agriculture Minister Tummala Nageswara Rao) అన్నారు.

    ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అండగా నిలుస్తుందని, వ్యవసాయాన్ని పండుగ చేయడంలో సహకరిస్తుందని తెలిపారు. నల్గొండ జిల్లా (Nalgonda district) చిట్యాల మండల వ్యవసాయ మార్కెట్ యార్డులో నిర్మించిన షాపింగ్ కాంప్లెక్స్ ను ఆయన బుధవారం ప్రారంభించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. ఈ సారి 15 రోజుల ముందే తొలకరి పలకరించిందని, ఇందుకు తగ్గట్టుగా రైతులు ఎలాంటి పంటలు వేసుకోవాలో ప్రణాళిక వేసుకోవాలని సూచించారు.

    దేశంలోనే అత్యధిక ధాన్యాన్ని పండించిన రాష్ట్రంగా తెలంగాణ (Telangana) నిలిచిందని, ధాన్యం పండించిన రైతులకు (farmers) రూ.1150 కోట్లను వారి ఖాతాలలో వేశామన్నారు. మన్మోహన్ సింగ్ (Manmohan Singh) ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో దేశవ్యాప్తంగా రైతు రుణమాఫీ కింద రూ.70 వేలకోట్లు జమ చేస్తే, తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Chief Minister Revanth Reddy) ఆధ్వర్యంలో మొదటి సంవత్సరమే రూ.2 లక్షలలోపు రుణాలున్న రైతుల ఖాతాలలో రూ.28 వేల కోట్లను జమ చేసినట్లు ఆయన వెల్లడించారు. రైతు భరోసా, రైతుబీమా, ఎరువులు, విత్తనాలు సకాలంలో ఇచ్చినప్పుడే రైతు సక్రమంగా వ్యవసాయం చేయగలడన్నారు.

    Agriculture Minister | కొత్త పంటల వైపు మళ్లాలి..

    ఈ వానాకాలం రైతులు నాట్లు వేయకముందే రైతు భరోసానిధులు (farmer insurance funds) వేస్తామని తుమ్మల చెప్పారు. తొలకరి ముందుగానే వచ్చినందున రైతులు ముందుగానే నాట్లు వేసుకోవాలని.. అకాల వర్షాలు, అనుకొని ఘటనలు జరిగినప్పుడు తట్టుకొని నిలబడేలా రైతు పంటలు వేసుకోవాలన్నారు. రైతులు ఆయిల్ ఫామ్, సాంప్రదాయ వంటల వైపు మొగ్గు చూపాలని, నల్గొండ జిల్లాలో (Nalgonda district) త్వరలోనే ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి వెల్లడించారు. తక్కువ నీటితో అధిక దిగుబడినిచ్చే కొత్త పంటలను పండించాలని పిలుపునిచ్చారు. జాజి, ఒక్క, పామాయిల్ వంటి పంటలను సాగు చేయాలని, అలాగే ఇతర కొత్త పంటల ఆవిష్కరణకు రైతులకు కృషి చేయాలన్నారు.

    వరి పత్తితో పాటు, మనకు అవసరమయ్యే పంటలను పండించాలని, పంటలు బాగా పండాలంటే పురుగుమందులు, యూరియా వాడకం తగ్గించాలని, సాంప్రదాయ వ్యవసాయానికి వెళ్లాలని, వ్యవసాయాన్ని పండుగ చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం (state government) రైతుకు పూర్తిగా సహకరిస్తుందని చెప్పారు. శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ.. రైతు భరోసా, రైతు బీమా, విద్యుత్, ఎరువులు, విత్తనాలు (fertilizers and seeds) వంటివి సకాలంలో రైతుకు అందజేసినప్పుడు రైతు సరైన విధంగా పంటలు పండించగలుగుతాడని తెలిపారు. దేశంలోనే అత్యధికంగా వరి పండించిన రాష్ట్రంగా తెలంగాణ (Telangana) రాష్ట్రం ఘనత సాధించిందని అన్నారు. రోహిణి కార్తిలోనే వర్షాలు వచ్చినందున రైతులు ముందే నాట్లు వేసుకునేందుకు సిద్ధం కావాలని, వారం, పది రోజుల్లో రైతు భరోసా వస్తుందని ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు.

    Latest articles

    Hyderabad Honeytrap | హైదరాబాద్​లో హనీట్రాప్​.. రూ.7 లక్షల కాజేత!

    అక్షరటుడే, హైదరాబాద్: Hyderabad Honeytrap : తెలంగాణ రాజధాని హైదరాబాద్(Telangana capital Hyderabad)​లో హనీట్రాప్ వెలుగుచూసింది. అమీర్​పేట్​(Ameerpet)లో 81...

    Nizamsagar reservoir flood | మొరాయిస్తున్న నిజాంసాగర్​ జలాశయం వరద గేటు..

    అక్షరటుడే, నిజాంసాగర్ : Nizamsagar reservoir flood : కామారెడ్డి (KamareddY) జిల్లాలోని నిజాంసాగర్ ప్రాజెక్టులోకి ఎగువ భాగం...

    Godavari | గోదావరి ఒడ్డున గుర్తుతెలియని మహిళ మృతదేహం లభ్యం

    అక్షరటుడే, ఇందూరు: Godavari : నిజామాబాద్​ జిల్లా మెండోరా మండలం పోచంపాడ్​లో (Pochampadu) గురువారం సాయంత్రం గోదావరి (Godavari)...

    BJP | బీజేపీ జిల్లా కార్యవర్గం ఎన్నిక

    అక్షరటుడే, ఇందూరు : BJP | ​ భారతీయ జనతా పార్టీ జిల్లా నూతన కార్యవర్గాన్ని నియమించినట్లు జిల్లా...

    More like this

    Hyderabad Honeytrap | హైదరాబాద్​లో హనీట్రాప్​.. రూ.7 లక్షల కాజేత!

    అక్షరటుడే, హైదరాబాద్: Hyderabad Honeytrap : తెలంగాణ రాజధాని హైదరాబాద్(Telangana capital Hyderabad)​లో హనీట్రాప్ వెలుగుచూసింది. అమీర్​పేట్​(Ameerpet)లో 81...

    Nizamsagar reservoir flood | మొరాయిస్తున్న నిజాంసాగర్​ జలాశయం వరద గేటు..

    అక్షరటుడే, నిజాంసాగర్ : Nizamsagar reservoir flood : కామారెడ్డి (KamareddY) జిల్లాలోని నిజాంసాగర్ ప్రాజెక్టులోకి ఎగువ భాగం...

    Godavari | గోదావరి ఒడ్డున గుర్తుతెలియని మహిళ మృతదేహం లభ్యం

    అక్షరటుడే, ఇందూరు: Godavari : నిజామాబాద్​ జిల్లా మెండోరా మండలం పోచంపాడ్​లో (Pochampadu) గురువారం సాయంత్రం గోదావరి (Godavari)...