అక్షరటుడే, వెబ్‌డెస్క్: Vivo T4R | ప్రముఖ స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థ అయిన వీవో(Vivo) టీ4 సిరీస్‌లో మరో మోడల్ ఫోన్‌ను తీసుకువచ్చింది. వీవో టీ4ఆర్ (Vivo T4R) పేరుతో తీసుకువస్తున్న ఈ స్లిమ్మెస్ట్ ఫోన్‌ను (Slimmest phone) గురువారం మధ్యాహ్నం 12 గంటలకు లాంచ్ చేసింది. రిటైల్ స్టోర్‌లతోపాటు వీవో ఇండియా ఇ-స్టోర్, ఫ్లిప్‌కార్ట్‌లో ఆగస్టు 5వ తేదీనుంచి అందుబాటులో ఉండనుంది. ఈ మోడల్ స్పెసిఫికేషన్ వివరాలు తెలుసుకుందామా..
- 6.77 ఇంచెస్ క్వాడ్ కర్వ్‌డ్ అమోలెడ్ ప్యానెల్, 120Hz రిఫ్రెష్ రేట్ కలిగి ఉన్న ఈ ఫోన్ హెచ్‌డీఆర్ 10+ను సపోర్ట్ చేస్తుంది. లో బ్లూ లైట్ ఎస్‌జీఎస్ సర్టిఫికేషన్‌ను కూడా కలిగి ఉంది. 7.39mm థిక్‌నెస్‌తో ఈ ఫోన్‌ను తీసుకువచ్చారు. ఐపీ 68, ఐపీ 69 డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ రేటింగ్ కలిగి ఉంది.
- మీడియాటెక్ డైమెన్సిటీ 7400 SoC చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. ఇది 4 nm ఫ్యాబ్రికేషన్ చిప్‌సెట్, 2.6 జీహెచ్‌జెడ్ సీపీయూ క్లాక్ స్పీడ్ కలిగి ఉంటుంది. అంటుటు స్కోర్ 7,50,000.
- ఆండ్రాయిడ్ 15 ఆధారిత ఫన్‌టచ్ OS 15. రెండేళ్లపాటు ఓఎస్, మూడేళ్లపాటు సెక్యూరిటీ అప్‌డేట్స్ అందించనున్నట్లు కంపెనీ ప్రకటించింది.
- వెనకవైపు ఓఐఎస్ సపోర్టుతో కూడిన 50 ఎంపీ సోనీ ఐఎంఎక్స్882 సెన్సార్, 2 ఎంపీ బొకే కెమెరా, ముందువైపు సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం 32 ఎంపీ కెమెరాను అమర్చారు. ముందు, వెనకవైపు అమర్చిన కెమెరాలతో 4k వీడియోలు రికార్డ్ చేయొచ్చు.
- బ్యాటరీ సామర్థ్యం 5700 ఎంఏహెచ్(లిథియం అయాన్). 44w ఫాస్ట్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేస్తుంది.
వేరియంట్స్..
మూడు వేరియంట్లలో ఈ మోడల్ ఫోన్ లభిస్తుంది.
8 ర్యామ్ 128 స్టోరేజీ వేరియంట్ ధర రూ. 19,499.
8 ర్యామ్ 256 స్టోరేజీ వేరియంట్ ధర రూ. 21,499.
12 జీబీ ర్యామ్ 256 జీబీ స్టోరేజీ వేరియంట్ ధర రూ. 23,499.
కార్డ్ ఆఫర్లు..
వీవో ఈ మోడల్ ఫోన్‌పై పలు ఆఫర్లను ప్రకటించింది. హెచ్‌డీఎఫ్‌సీ, యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డులతో రూ. 2 వేల వరకు తక్షణ డిస్కౌంట్ (Discount) ఇవ్వనున్నట్లు తెలిపింది. ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డుతో 5 శాతం వరకు క్యాష్ బ్యాక్ (Cashback) లభిస్తుంది.