అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Vivo V60 | చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్ ఫోన్‌ల తయారీ సంస్థ అయిన వీవో.. మరో మోడల్‌ను భారత్ మార్కెట్‌లో విడుదల చేయనుంది. మిడ్ రేంజ్‌లో ఫ్లాగ్‌షిప్ సెగ్మెంట్‌లో వీ60 పేరుతో తీసుకువస్తున్న ఈ మోడల్ 12వ తేదీన లాంచ్ కానుంది. 6500 ఎంఏహెచ్ బ్యాటరీ సెగ్మెంట్‌లో ఇదే స్లిమ్మెస్ట్ మోడల్(Slimmest model) అని కంపెనీ పేర్కొంటోంది. అధికారిక వెబ్‌సైట్‌తోపాటు ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉండనున్న ఈ ఫోన్ ఫీచర్స్ ఇలా ఉండే అవకాశాలు ఉన్నాయి.
డిస్‌ప్లే : 6.67 ఇంచ్ 1.5కే అమోలెడ్ డిస్‌ప్లే, 120 హెడ్జ్ రిఫ్రెష్ రేట్‌తో వస్తున్న ఈ ఫోన్ హెచ్‌డీఆర్ 100 ప్లస్‌ను సపోర్ట్ చేస్తుంది. 1300 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ కలిగి ఉంది. దీంతో ఎండలోనూ స్క్రీన్ స్పష్టంగా కనిపిస్తుంది.
పిక్సల్ రిజల్యూషన్ 1260 x 2800గా ఉంది. ఐపీ68, ఐపీ69 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్స్ రేటింగ్ కలిగి ఉంది.
క్వాడ్ కర్వ్‌డ్ గ్లాస్ డిజైన్‌తో తీసుకువస్తున్న ఈ మోడల్ ప్రీమియం లుక్‌ను కలిగి ఉంటుందని కంపెనీ పేర్కొంది.
ప్రాసెసర్ : క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 4 ఎస్‌వోసీ ప్రాసెసర్ ఉపయోగించారు. ఇది 4ఎన్‌ఎం ఫాబ్రికేషన్ టెక్నాలజీతతో తయారవడంతో వేడి తక్కువగా ఉంటుంది.
ఆండ్రాయిడ్ 15 ఆధారిత ఫన్‌టచ్ ఓఎస్ 15 ఆపరేటింగ్ సిస్టం. గూగుల్ జెమినీ ఆధారిత ఏఐ టూల్స్ ఉన్నాయి.
బ్యాటరీ సామర్థ్యం : 6500 ఎంఏహెచ్ బ్యాటరీ.. 90 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. గంటలో ఫుల్ చార్జింగ్ అవుతుందని కంపెనీ పేర్కొంది. ఈ విభాగంలో ఇదే స్లిమ్మెస్ట్ ఫోన్ అని కంపెనీ పేర్కొంటోంది.
కెమెరా సెటప్ : వెనుకవైపు 50 మెగా పిక్సెల్ సోనీ ఐఎంఎక్స్766 మెయిన్ ఏఐ కెమెరాతోపాటు 8 మెగా పిక్సెల్ అల్ట్రావైడ్ కెమెరా, 50 మెగాపిక్సెల్ టెలీఫొటో లెన్స్‌తో కూడిన ట్రిపుల్ కెమెరా సెట్ అప్ అమర్చారు. ఇవి 4కే వీడియో రికార్డింగ్‌ను సపోర్ట్ చేస్తాయి. మల్టీ ఫోకల్ పోట్రెయిట్, ఏఆర్ మోడ్, జెడ్‌ఈఐఎస్‌ఎస్ నేచురల్ కలర్ వంటి ఫీచర్లున్నాయి..
ముందువైపు సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 50 మెగా పిక్సెల్ కెమెరా ఉంది.
వేరియంట్స్ : ఇది మూడు వేరియంట్‌లలో లభించనున్నాయి. 8 జీబీ ర్యామ్, 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, 8 జీబీ ర్యామ్, 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, 12 జీబీ ర్యామ్, 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్‌లలో లభించే ఫోన్ల ధర రూ. 45 వేలలోపు ఉండే అవకాశాలున్నాయి.
ఇది ఆస్పిసియస్ గోల్డ్, మూన్‌లైట్ బ్లూ, మిస్ట్ గ్రే కలర్స్‌లో లభిస్తుంది. ఫోన్ ధర రూ. 45 వేల లోపు ఉండనుంది.