అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Samsung Galaxy M17 | సౌత్ కొరియాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థ శాంసంగ్ మరో మోడల్ స్మార్ట్‌ఫోన్‌ను శుక్రవారం మధ్యాహ్నం 12 గంటలకు లాంచ్ చేసింది.
శాంసంగ్ గెలాక్సీ ఎం17 5జీ(Samsung Galaxy M17 5G) పేరిట దీనిని తీసుకువచ్చింది. స్లిమ్మెస్ట్ ఫోన్(Slimmest Phone)గా పేర్కొంటున్న దీని మందం 7.5 ఎంఎం. ఈ మోడల్ ఫోన్ ఈనెల 13 నుంచి అమెజాన్(Amazon)తోపాటు శాంసంగ్ ఇండియా అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉండనుంది. ఈ మోడల్ స్పెసిఫికేషన్స్ తెలుసుకుందామా..
డిస్‌ప్లే : 6.7 అంగుళాల ఫుల్ హెచ్‌డీ ప్లస్ సూపర్ అమోలెడ్ డిస్‌ప్లే అమర్చారు. 90Hz రిఫ్రెష్ రేట్ కలిగి ఉంది. 1,100 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్రొటెక్షన్‌తో వస్తోంది.
సాఫ్ట్‌వేర్ : ఆండ్రాయిడ్ 15 ఆధారిత వన్ UI 7 ఆధారంగా పనిచేస్తుంది. ఇందులో శాంసంగ్ Exynos 1330 ప్రాసెసర్ అమర్చారు. ఆరేళ్ల(6 years) పాటు ఆండ్రాయిడ్ అప్‌డేట్స్‌తోపాటు సెక్యూరిటీ అప్‌డేట్స్ అందించనున్నట్లు కంపెనీ ప్రకటించింది.
కెమెరా సెటప్ : వెనకభాగంలో 50MP(ఓఐఎస్) ప్రధాన కెమెరా, 5ఎంపీ అల్ట్రావైడ్, 2ఎంపీ మాక్రో కెమెరాతో ట్రిపుల్ రేర్ కెమెరా సెటప్ ఉంది. సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం 13ఎంపీ సెల్ఫీ కెమెరా అమర్చారు.
బ్యాటరీ : 5000 mAh బ్యాటరీ అమర్చారు. ఇది 25 డబ్ల్యూ ఫాస్ట్ చార్జింగ్‌ను సపోర్ట్ చేస్తుంది.
వేరియంట్, ధర : ఇది మూన్‌లైట్ సిల్వర్, సఫైర్ బ్లాక్ కలర్స్‌లో లభించనుంది.
4జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజీ వేరియంట్ ధర రూ.12,499.
6జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజీ వేరియంట్ ధర రూ.13,999.
8జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజీ వేరియంట్ ధర రూ.15,499.