అక్షరటుడే, వెబ్‌డెస్క్: Poco M8 5G | చైనా (China)కు చెందిన స్మార్ట్ ఫోన్ల తయారీ కంపెనీ అయిన పోకో భారత్ మార్కెట్లో మరో మోడల్‌ను రిలీజ్ చేయడానికి సన్నద్ధమైంది. ఈనెల 8న పోకో ఎం8 పేరుతో నూతన మోడల్‌ను విడుదల చేయనుంది. దీనికి సంబంధించిన పోస్టర్ సోషల్ మీడియా (Social Media) ప్లాట్ ఫాం అయిన ఎక్స్‌లో ఉంది.
నూతన మోడల్ ఫీచర్స్‌ను అధికారికంగా ప్రకటించనప్పటికీ ఆన్లైన్ టెక్ మీడియా ప్లాట్ ఫాంలలో లీక్ అయిన సమాచారం మేరకు స్పెసిఫికేషన్స్ ఇలా ఉండే అవకాశాలు ఉన్నాయి. ఈ స్మార్ట్ ఫోన్ (Smart Phone) అత్యంత స్లిమ్, లైట్‌గా ఉంటుందని తెలుస్తోంది.
డిస్ప్లే : 6.77 ఇంచ్ అమోలెడ్ డిస్ ప్లే అమర్చారు. ఇది 120 హెడ్జ్ రిఫ్రెష్ రేట్, 3,200 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 1080 2392 పిక్సల్స్ రిజల్యూషన్స్, ఐపీ65 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ కలిగి ఉంది. ఆన్ స్క్రీన్ ఆప్టికల్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంది. 7.35mm థిక్నెస్, 178 గ్రాముల బరువు ఉండనుంది.
సాఫ్ట్వేర్ : స్నాప్ డ్రాగన్ 6 జెన్ 3 ప్రాసెసర్ అమర్చారు. ఇది ఆండ్రాయిడ్ 15 ఆధారిత హైపర్ OS 2.0 ఆపరేటింగ్ సిస్టంతో పనిచేస్తుంది.
కెమెరా సెటప్ : వెనకవైపు 50 మెగా పిక్సెల్ మెయిన్ కెమెరాతో పాటు 2 మెగా పిక్సెల్(MP) డెప్త్ సెన్సార్‌తో కూడిన డ్యూయల్ కెమెరా సెట్ అప్ ఇచ్చారు. ముందువైపు సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 8 మెగా పిక్సెల్ కెమెరా ఉంది.
బ్యాటరీ : 5520 ఎంఏహెచ్ లియాన్ బ్యాటరీ అమర్చనున్నారు. ఇది 45w ఫాస్ట్ చార్జింగ్‌ను సపోర్ట్ చేస్తుంది.
వేరియంట్స్ : ఈ మోడల్‌ను రెండు వేరియంట్లలో తీసుకువస్తోంది. 8 జీబీ ర్యామ్, 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, 8 జీబీ ర్యామ్, 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్లలో లభిస్తుంది. దీని ధర రూ. 13,999 నుంచి ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి.