అక్షరటుడే, వెబ్‌డెస్క్: SIT Investigation | ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR)కు మరోసారి నోటీసులు ఇవ్వడానికి సిట్ సిద్ధం అయింది. ఈ మేరకు లీగల్ ఒపీనియన్ తీసుకుంటుంది.
ఫోన్ ట్యాపింగ్ (Phone Tapping Case) వ్యవహారంలో శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు విచారణకు రావాలని సిట్ అధికారులు గురువారం కేసీఆర్‌కు నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే మున్సిపల్ ఎన్నికల (Municipal Elections) నామినేషన్ల నేపథ్యంలో తాను రాలేనని కేసీఆర్ సిట్‌కు లేఖ రాశారు. మరో తేదిన విచారణకు పిలవాలని కోరారు. ఈ మేరకు సిట్ అధికారులు చర్యలు చేపట్టారు. ఆయనకు మరో నోటీస్ ఇచ్చి విచారణకు పిలవనునన్నారు. కేసీఆర్ లేఖకు ఈరోజు సిట్ సమాధానం ఇవ్వనుంది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అధికారుల స్టేట్మెంట్ల ఆధారంగా కేసీఆర్‌కు 160 సీఆర్పీసీ కింద సిట్ నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది. అయితే కేసీఆర్‌ను ఎప్పుడు, ఎక్కడ, ఎన్ని గంటలకు ప్రశ్నిస్తారనే దానిపై ఉత్కంఠ నెలకొంది.
SIT Investigation | ఫామ్‌హౌస్‌లోనే..
ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలోనే సిట్ అధికారులు (SIT Officers) కేసీఆర్‌ను విచారించే అవకాశం ఉంది. సీఆర్పీసీ సెక్షన్160 ప్రకారం 65 ఏళ్లు దాటిన వ్యక్తులు స్టేషన్‌కు రావాల్సిన అవసరం లేదని కేసీఆర్ తన లేఖలో పేర్కొన్న విషయం తెలిసిందే. దీంతో నందినగర్‌లోని తన నివాసం లేదా ఎర్రవల్లిలో విచారించే అవకాశం ఉంది. కాగా కేసీఆర్ హయాంలో రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఫోన్ ట్యాపింగ్ జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ మేరకు పోలీసులు, సిట్ అధికారులు ఇప్పటికే బాధితుల స్టేట్మెంట్ రికార్డు చేశారు. బీఆర్ఎస్ నేతలు కేటీఆర్ (KTR), హరీశ్‌రావు (Harish Rao), సంతోష్‌రావు, శ్రవణ్‌రావు తదితరులను విచారించారు. ఫోన్ ట్యాపింగ్ చేసిన అధికారాఉలను ప్రశ్నించారు. వారు ఇచ్చిన సమాచారం ఆధారంగా కేసీఆర్‌కు నోటీసులు ఇవ్వనున్నారు.